మంచు మోహన్ బాబు (Mohan Babu) కుటుంబంలోని (Manchu Family) విభేదాలు ఇప్పుడు మరింత పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. ఇటీవల జరిగిన గొడవల కారణంగా మీడియాలో చాలా వీడియోలు వైరల్ కాగా, తాజాగా మరో అన్‌సీన్ వీడియో బయటకు రావడం సంచలనంగా మారింది. ఈ వీడియోలో మంచు మనోజ్ ఆగ్రహంతో ఉన్న దృశ్యాలు కనిపించడం, ఒక వ్యక్తితో ఘాటుగా మాట్లాడడం కనిపిస్తోంది. ఇక ఈ వీడియోను ఎవరు లీక్ చేశారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. లేటెస్ట్ గా లీకైన ఈ వీడియోలో కూర్చుని మాట్లాడుకుందాం అంటూ మోహన్ బాబు సన్నిహితులు సూచన ఇచ్చినప్పుడు, ఆ వ్యక్తిపై మనోజ్ (Manchu Manoj) సీరియస్ గా స్పందించినట్లు కనిపిస్తోంది.
“ముసలోడివి నువ్వు నన్ను అన్న అని పిలుస్తావేంటి?” అంటూ మనోజ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వినిపిస్తోంది. ఇక వెనకాల నుంచి మోహన్ బాబు కూడా మనోజ్ ను వెనక్కి లాగేందుకు ప్రయత్నం చేశారు. గేటు ముందు మీడియా ఉండడంతో మోహన్ బాబు మనోజ్ ను వెనక్కి తీసుకుని వెళ్ళేందుకు ప్రయత్నం చేశారు. ఇక ఈ వీడియో లీక్ వెనుక ఎవరి హస్తం ఉందనేది ప్రశ్నగా మారింది.
మనోజ్ వర్గం ఈ లీక్ తనపై నెగటివ్ ఇంప్రెషన్ కలిగించేందుకే చేశారంటూ ఆరోపణలు చేస్తోంది. మరోవైపు, మనోజ్‌పై సానుభూతి పెరుగుతుందని, ఈ లీక్ విషయంలో మిగతా కుటుంబ సభ్యుల పాత్ర ఉందంటూ కొన్ని వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇదిలా ఉండగా, మంచు మోహన్ బాబు స్వయంగా జర్నలిస్టుల గాయానికి క్షమాపణలు చెబుతూ లేఖ విడుదల చేశారు,
మనోజ్ కూడా మీడియాపై తన వివరణ వ్యక్తం చేయడం వంటి పరిణామాలు జరిగిన నేపథ్యంలో, ఈ కొత్త వీడియో పలు అనుమానాలకు తావిస్తుంది. కుటుంబంలో విభేదాలు అంతకంతకూ తీవ్రమవుతున్నాయని, మరింత స్పష్టత రాకుండా, లీకులు చేయడం పరిస్థితిని మరింత క్లిష్టం చేస్తున్నదని అంటున్నారు.
A Video is Going Viral on social media Manchu Manoj Fighting With Relatives While Mohan Babu also seen in the viral video . #viralvideo pic.twitter.com/pJsxlQjZIo
— Dakshin Bharat News (@Dilipkumar_PTI) December 13, 2024