Manchu Lakshmi : మాన్ స్టర్ చిత్రానికి గాను అరుదైన అవార్డు అందుకున్న మంచు లక్ష్మీ

గతేడాది చివర్లో వచ్చిన మోహన్ లాల్ మాన్ స్టర్ మూవీలో మంజు దుర్గ అనే లెస్బియన్ పాత్రలో నటించి మెప్పించింది మంచు లక్ష్మీ . ఇలాంటి బోల్డ్ రోల్ ప్లే చేయడం అంటే మామూలు విషయం కాదు. అయినా ఎంతో ధైర్యం చేసి ఈ పాత్ర చేసింది. ఈ మూవీలో వీరసింహారెడ్డి బ్యూటీ హనీ రోజ్ కూడా నటించింది. మంచు లక్ష్మీ.. హనీ రోజ్ ల మధ్య రొమాంటిక్ సన్నివేశాలు కూడా ఉన్నాయి.

అలాగే మోహన్ లాల్ తో ఓ ఫైట్ కూడా చేసింది మంచు లక్ష్మీ. ఇక ఈ పాత్రకు గానూ ఆమెకు ఓ అరుదైన అవార్డు లభించడం విశేషం. హలో హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డ్స్-సౌత్ 2023లో ‘బెస్ట్ వెర్సటైల్ యాక్టర్’గా అవార్డు దక్కించుకుంది మంచు లక్ష్మీ. ఈ అవార్డు తీసుకున్న వీడియోను ఆమె తన సోషల్ మీడియా షేర్ చేసింది. ఈరోజు ఎంతో ఎనర్జిటిక్ అలాగే బాగా కలిసొచ్చిన రోజు.

నన్ను ఈ ఏడాది వెర్సటైల్ యాక్టర్ గా గుర్తించిన హలో మాగ్ ఇండియా కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా ఎదుగుదల చూసిన స్నేహితులు, ఆత్మీయుల మధ్య ఈ అవార్డును తీసుకుంటున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ రోజును మీతో కలిసి పంచుకుంటున్నందుకు కూడా ఎంతో సంతోషంగా ఉంది.

నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన చిత్ర బృందానికి కూడా స్పెషల్ థాంక్స్ చెప్పుకుంటున్నాను’ అంటూ రాసుకొచ్చింది మంచు లక్ష్మీ. ప్రస్తుతం మంచు లక్ష్మి… అగ్ని నక్షత్రం అనే మరో చిత్రంలో నటిస్తూ బిజీగా గడుపుతోంది. ఇక నెటిజన్లు కూడా మంచు లక్ష్మీ కి కంగ్రాట్స్ చెబుతూ కామెంట్లు పెడుతున్నారు.

హంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పఠాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

సౌందర్య టు శృతి హాసన్.. సంక్రాంతికి రెండేసి సినిమాలతో పలకరించిన హీరోయిన్ల లిస్ట్..!
అతి తక్కువ రోజుల్లో వంద కోట్లు కొల్లగొట్టిన 10 తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus