టాలీవుడ్ లో మంచు లక్ష్మీ, రకుల్ ప్రీత్ సింగ్ మంచి స్నేహితులనే సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి సోషల్ మీడియాలో షేర్ చేసే కొన్ని ఫోటోలపై నెటిజన్లు పలు కామెంట్స్ చేస్తుంటారు. రొమాంటిక్ గా ఉంటూ.. చాలా క్లోజ్ గా ఉండే ఫోటోలను షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఈ వార్తలపై మంచు లక్ష్మీ, రకుల్ స్పందించారు. రానా హోస్ట్ చేసే నెంబర్ వన్ యారీ మూడో సీజన్ లో మంచు లక్ష్మీ, రకుల్ అతిథులుగా హాజరయ్యారు. తమపై వచ్చే గాసిప్స్ పై స్పందించిన వీరు.. సమాధానాలు వింతగా చెప్పారు.
తమ మీద ఎన్నో రకాల వార్తలు వస్తుంటాయని.. తమ మధ్య ఏదో ఉందని అంటుంటారు. చాలా చెత్తగా రాస్తుంటారని.. మాట్లాడుతుంటారని రకుల్ చెప్పుకొచ్చారు. ఇద్దరం క్లోజ్ గా ఉన్న ఫోటోలపై ఏవేవో రాస్తుంటారని అన్నారు. అనంతరం మంచు లక్ష్మీ జీవితంలోకి రకుల్ ఎంట్రీ ఇచ్చిన తరువాత అన్ని పద్ధతులు మారిపోయాయని రానా అన్నారు. తినే తిండి విషయంలో మంచు లక్ష్మీ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుందని అన్నారు. ఎక్కడికైనా వెళ్లినా కూడా రకుల్ ఫుడ్ ఆర్డర్ చేస్తుంటుందని మంచు లక్ష్మీ అన్నారు.
ఇదే క్రమంలో రకుల్ పెళ్లి గురించి రానా కామెంట్ చేశారు. నీ పెళ్లెప్పుడు అంటూ రకుల్ ని రానా ప్రశ్నించగా.. ఈ ఏడాదిలోనే రకుల్ పెళ్లి ఉంటుందని అసలు విషయం బయటపెట్టింది మంచులక్ష్మీ. కాదు.. కాదంటూ రకుల్ వారించగా.. పెళ్లి కాకపోతే ఆ ప్రయత్నాలైనా జరుగుతాయని అన్నారు. బాయ్ ఫ్రెండ్ వస్తాడేమో అని మంచు లక్ష్మీ అన్నారు. వచ్చే బాయ్ ఫ్రెండ్ ఎవరో నా దగ్గరకి వస్తే రకుల్ గురించి మొత్తం చెప్పి పంపిస్తానని మంచు లక్ష్మీ చెప్పుకొచ్చారు.