Manchu Lakshmi: పవన్‌ – విష్ణు గాసిప్స్‌పై మంచు లక్ష్మి కౌంటర్‌ ఎటాక్‌

నిప్పు లేని పొగ రాదు… ఈ మాట ఇంకోలా చెబితే ‘మంచు’ ముక్క లేనిదే పొగరాదు. ఏదైనా విషయం పొగ గురించే. తాజాగా ఇలాంటి పొగ అంటే పుకార్లు వస్తున్న అంశం పవన్‌ కల్యాణ్‌ – మంచు విష్ణు కలయిక. ఇటీవల ‘అలయ్‌ బలయ్‌’ కార్యక్రమంలో పవన్‌ కల్యాణ్‌ – మంచు విష్ణు ఎదురుపడ్డారు. అయితే ఆ సమయంలో ఇద్దరూ మాట్లాడుకుకోకుండా, ఎడమొహం పెడమొహంలా ఉన్నారని వార్తలొచ్చాయి. దీనిపై మంచు లక్ష్మి తనదైన శైలిలో స్పందించారు.

‘‘మంచు విష్ణు గెలవాలని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రజలు కోరుకున్నారు. విష్ణు గెలుపును కోరుకున్న ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. ఇటీవల జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో విష్ణు, పవన్ కల్యాణ్ మాట్లాడుకోలేదని వార్తలొచ్చాయి. అంతేకాదు కార్యక్రమంలో ఎడమొహం, పెడమొహంగా కూడా ఉన్నారని టీవీల్లో చూపించారని అన్నారు. కానీ అక్కడ జరిగింది వేరు’’ అంటూ మంచు లక్ష్మి చెప్పుకొచ్చింది. ‘‘విష్ణు – పవన్‌ కల్యాణ్‌ విషయంలో టీవీల్లో వచ్చిన వార్తలు అవాస్తవం.

నిజానికి అక్కడ వారిద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నారు. అయితే దీనిపై సోషల్ మీడియాలో కూడా ఏదేదో రాస్తున్నారు. ఇండస్ట్రీలో మేమంతా ఒకటే. ఎప్పుడూ కలిసే ఉంటాం’’ అంటూ చెప్పుకొచ్చారు మంచు లక్ష్మి. మేడమ్‌ మీరు చెప్పింది కరెక్టే… మాట్లాడితే కెమెరాల్లో కనిపించాలి కదా. అక్కడే ఉన్నాయి మరి చాలా కెమెరాలు.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహా సముద్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ఒక్కో సినిమాకు ఈ స్టార్ హీరోలు ఎంతెంత డిమాండ్ చేస్తున్నారో తెలుసా?
టాలీవుడ్ లో బి.టెక్ చదువుకున్న 10 మంది లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus