Manchu Lakshmi: శ్రీకాకుళం మంచు లక్ష్మీ క్రేజ్ చూశారా.. వైరల్ అవుతున్న వీడియో!

మంచు లక్ష్మి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మోహన్ బాబు కుమార్తెగా ఇండస్ట్రీలో కి అడుగుపెట్టి.. మొదట బుల్లితెర పై పలు టాక్ షోలకు హోస్ట్ గా వ్యవహరించింది. అటు తర్వాత అనగనగా ఓ ధీరుడు, గుండెల్లో గోదారి, ఉ కొడతార ఉలిక్కి పడతారా , దొంగాట, వైఫ్ ఆఫ్ రామ్ వంటి సినిమాలతో ఈమె మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఈమె మాట్లాడే ఇంగ్లీష్ పై సోషల్ మీడియాలో భీభత్సమైన ట్రోలింగ్ జరుగుతూ ఉంటుంది అన్న సంగతి తెలిసిందే.

ఇదిలా ఉండగా.. తాజాగా మోహన్ లాల్ మాన్ స్టర్ మూవీ లో ముఖ్య పాత్ర పోషించింది. ఈమె పాత్రకు మంచి అప్లాజ్ వచ్చింది. ఇదిలా ఉండగా.. తాజాగా మంచు లక్ష్మీ శ్రీకాకుళం వెళ్ళింది. అక్కడ ఈమెను చూడ్డానికి జనాలు ఎగబడ్డారు. మంగళవారం నాడు అరసవల్లి శ్రీ సూర్య నారాయణ స్వామిని దర్శించుకునేందుకు ఆమె వెళ్ళింది. తన తండ్రి సూచన నిమిత్తం ఆమె అక్కడికి వెళ్లినట్టు తెలిసింది. అలాగే..

టీచ్ ఫర్ చేంజ్ అనే ఎన్జీఓ తరుపున 475 పాటశాలల్లో స్మార్ట్ క్లాసులు నిర్వహిస్తున్నామని, నాణ్యమైన ఇంగ్లీష్ అందరికీ నేర్పించాలి, అది వారి భవిష్యత్తు కు ఉపయోగపడాలి అని మంచు లక్ష్మీ కోరారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న చాలా మంది విద్యార్థులు వచ్చే రెండేళ్లలో ఫ్లుఎంట్ ఇంగ్లీష్ మాట్లాడాలని, మాట్లాడతారని ఆమె చెప్పుకొచ్చింది. ఇక మంచు లక్ష్మి ని చూసేందుకు అంతమంది జనాలు ఎగబడి రావడం అందరికీ షాకిచ్చింది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus