Manchu Lakshmi Home Tour: మంచు వారి హోం టూర్‌ వీడియో అదిరిందిగా!

సినిమా తారలు, టీవీ తారలు ఇటీవల కాలంలో యూట్యూబ్‌లో బిజీ అవుతున్నారు. వివిధ రంగాలకు సంబంధించి ఆసక్తికరమైన వీడియోలు చేసి రిలీజ్‌ చేస్తుంటారు. అలాంటి వీడియోల్లో హోం టూర్‌ కచ్చితంగా ఉంటుంది. ఈ క్రమంలో మంచు లక్ష్మీ ప్రసన్న కూడా హోం టూర్‌ వీడియో రూపొందించారు. ఇటీవల ఆ వీడియోను విడుదల చేసింది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది. తన తండ్రి మోహన్‌బాబు తనకిచ్చిన ఇల్లు అని చెబుతూ, దానికి ఆమె ఎలా మార్చుకున్నారనేది కూడా చూపించారు.

ఇంట్లో వస్తువుల గురించి చెబుతున్న క్రమంలో యూఎస్‌లో తన ఇల్లు కాలిపోయిన విషయం గురించి కూడా చెప్పారు. ఆ ఘటనలో కేవలం ఓ పెయింటింగ్‌ మాత్రమే మిగిలిందని.. అదంటే తనకు ఎంతో ఇష్టమని మంచు లక్ష్మి తెలిపారు. ఈ ఇంటిలోకి ఆరేళ్ల క్రితం వచ్చినట్లు.. కాలానుగుణంగా అభిరుచికి తగ్గట్టు మార్పులు చేసుకున్నట్లు లక్ష్మి చెప్పారు. పెయింటింగ్స్ అన్నా కూడా తనకు ఎంతో ఇష్టమని ఇంట్లో గోడలకు ఉన్న రకరకాల పెయింటింగ్స్‌ గురించి వివరంగా చెప్పుకొచ్చారు మంచు లక్ష్మి.

దాంతోపాటు పదుల సంఖ్యలో ఉన్న టీ కలెక్షన్స్‌, ఫొటో కలెక్షన్స్, జ్యువెలరీ కలెక్షన్స్, షూ కలెక్షన్స్‌, పొడులు గురించి చెప్పుకుంటూ చూపించారు. ఆమె ఇంట్లో ప్రత్యేకంగా చేసే వంటల గురించి చెప్పారు కూడా. డైనింగ్‌ టేబుల్‌కి ఉన్న చరిత్ర గురించి కూడా మంచు లక్ష్మి చెప్పారు. రాజకీయ, సినీ పరిశ్రమకు సంబంధించిన ఎంతో మంది ప్రముఖులు ఈ డైనింగ్‌ టేబుల్‌పై భోజనం చేశారని.. అందుకే దానిని ఎంతో భద్రంగా చూసుకుంటున్నానని లక్ష్మి వివరించారు. ఇంకా వివరాలు కావాలంటే వీడియో చూసేయండి.


నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus