లవ్ అండ్ యాక్షన్ సినిమాలు చేసే యువ హీరో మంచు మనోజ్ వీరోచిత పాత్రకోసం కష్టపడుతున్నారు. అజయ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘ఒక్కడు మిగలడు ” చిత్రంలో మనోజ్ ఎల్టీటీఈ కమాండర్ గా కనిపించబోతున్నారు. 1990లో శ్రీలంకలో జరిగిన గొడవలను ఆధారం చేసుకుని తెరకెక్కిస్తున్న ఈ సినిమాను నిర్మాత అచ్చిబాబు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నారు. ఈ మూవీలో కీలకమైన పోరాట సన్నివేశాల కోసం వైజాక్ లోని పరవాడ మండలం ముత్యాలమ్మ పాలెంలో పెద్ద సెట్ వేశారు.
సముద్ర తీరాన పోర్ట్ గా మలిచిన ఆ ప్రాంతంలో జులై 15 నుంచి ఆగస్టు 1 వరకు మొదటి షెడ్యూల్ జరిగింది. అనేక వాహనాలు, పెద్ద ఎత్తున ఆయుధాలు, 600 మంది జూనియర్ ఆర్టిస్టులతో ఈ వార్ సెక్వెన్స్ ని అజయ్ షూట్ చేశారు. ఈ షెడ్యూల్ కోసం 75 లక్షలు ఖర్చు చేసినట్లు తెలిసింది. ఇంకా 75 శాతం సినిమా చిత్రీకరించాలి. తరువాత షెడ్యూల్ లో భీకరమైన పోరాటాలు ఉంటాయని, ఈ చిత్రం మనోజ్ కెరీర్లో ఓ మైలు రాయిగా నిలుస్తుందని చిత్ర బృందం తెలిపింది. మనోజ్ సరసన రెజీనా నటిస్తున్న ఈ మూవీని తమిళంలో కూడా డబ్ చేసి రెండు భాషల్లో ఒకే సారి విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
My new film ‘Okkadu Migiladu’ directed by Ajay Andrews. Playing an intense & emotional character.. pic.twitter.com/XFPB7KXl6D