Manchu Manoj: భార్యకు బర్త్ డే విషెస్ చెప్పిన మనోజ్.. అలా కామెంట్స్ చేస్తూ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా మంచు మనోజ్ కు ప్రత్యేక గుర్తింపు ఉండగా మంచు మనోజ్ కెరీర్ పరంగా ఎన్నో హిట్లను ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం కొన్ని సినిమాలలో మనోజ్ విలన్ గా కూడా నటిస్తున్నారని వార్తలు జోరుగా ప్రచారంలోకి వస్తున్నాయి. మనోజ్ రెమ్యునరేషన్ ఒకింత భారీ స్థాయిలోనే ఉండగా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ మనోజ్ సత్తా చాటుతున్నారు.

Manchu Manoj

నా జీవితంలో నువ్వే నాకు ఇన్స్పిరేషన్ అంటూ మనోజ్ భార్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. నా లైఫ్ లోని సూపర్ ఉమెన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు అని మనోజ్ పేర్కొన్నారు. నాకు ఇన్స్పిరేషన్ గా నిలిచినందుకు మౌనికకు థ్యాంక్స్ అని మనోజ్ కామెంట్లు చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మౌనికకు మంచు లక్ష్మి సైతం బర్త్ డే విషెస్ చెప్పారు.

మౌనిక ఈ ఏడాది ఏప్రిల్ లో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఫ్యాన్స్ సైతం మౌనికకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మంచు లక్ష్మి మౌనికతో కలిసి దిగిన కొన్ని ఫోటోలను సైతం పంచుకున్నారు. మనోజ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ కు 18 వేలకు పైగా లైక్స్ వచ్చాయి. భూమా మౌనిక కెరీర్ పరంగా పలు వ్యాపారాలతో బిజీగా ఉండటం గమనార్హం.

భూమా మౌనిక పొలిటికల్ ఎంట్రీ ఇస్తారని ప్రచారం జరిగినా ఆ ప్రచారంలో నిజనిజాలు తెలియాల్సి ఉంది. ఇప్పట్లో అయితే ఆమె పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు తక్కువని చెప్పవచ్చు. మనోజ్ నటించిన సినిమాలు వచ్చే ఏడాది థియేటర్లలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. మనోజ్ కు ఇతర భాషల్లో సైతం క్రేజ్ పెరుగుతుండటం ఫ్యాన్స్ కు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. మనోజ్ తన సినిమాల లుక్స్ విషయంలో సైతం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

పోసాని అన్ని మాటలు అంటే.. ఎవరూ మాట్లాడలేదేం.. పూనమ్‌ కౌంటర్‌

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus