Manchu Manoj: ఆ బిజినెస్ స్టార్ట్ చేస్తున్న మంచు మనోజ్!

మేజర్ చంద్రకాంత్ సినిమాతో పాటు మరికొన్ని సినిమాలలో బాలనటుడిగా నటించిన మంచు మనోజ్ దొంగ దొంగది సినిమాతో హీరోగా కెరీర్ ను మొదలుపెట్టారు. బిందాస్, వేదం, కరెంట్ తీగ, పోటుగాడు సినిమాలతో మనోజ్ విజయాలను సొంతం చేసుకున్నారు. ఈ మధ్య కాలంలో మనోజ్ పరిమితంగా సినిమాల్లో నటిస్తుండగా ప్రస్తుతం మనోజ్ హీరోగా అహం బ్రహ్మాస్మి అనే సినిమా తెరకెక్కుతోంది. అహం బ్రహ్మాస్మి సినిమాపై భారీగా అంచనాలు నెలకొనగా ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో తెలియాల్సి ఉంది.

అయితే తాజాగా అక్క మంచు లక్ష్మీతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంచు మనోజ్ మీడియాతో మాట్లాడుతూ ఏపీ తెలంగాణ రాష్ట్రాలలో వెంచర్స్ లను ప్రారంభించనున్నామని తెలిపారు. చాలామందికి ఉద్యోగాలు కల్పించే దిశగా మంచు మనోజ్ అడుగులు వేస్తున్నారని సమాచారం. మంచు మనోజ్ రానున్న రోజుల్లో సినిమాల్లో నటిస్తారా..? లేక వ్యాపారాలకే పూర్తిగా పరిమితమవుతారా..? అనే ప్రశ్నలు వినిపిస్తుండగా సినిమాల్లో కొనసాగుతానని మనోజ్ ట్విట్టర్ ద్వారా స్పష్టం చేశారు.

అహం బ్రహ్మాస్మి సినిమా నుంచి ఇప్పటికే ఫస్ట్ లుక్, టీజర్ రిలీజైంది. ఈ మధ్య కాలంలో చాలామంది స్టార్ హీరోలు ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు వ్యాపారాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. సినిమాల ద్వారా వచ్చిన క్రేజ్ నటీనటుల బిజినెస్ కు హెల్ప్ అవుతోంది. మనోజ్ స్పందించి సినిమాలకు దూరం అవుతున్నట్టు వైరల్ అవుతున్న వార్తలకు చెక్ పెట్టారు. తన గురించి స్ప్రెడ్ అవుతున్న రాంగ్ న్యూస్ ను మనోజ్ ఖండించారు.


Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus