Manchu Manoj: కులంపై మంచు మనోజ్ కామెంట్స్!

సోషల్ మీడియాలో మంచు ఫ్యామిలీని తరచూ ట్రోల్ చేస్తుంటారు. మంచు విష్ణు, మంచు లక్ష్మిలను ఎక్కువగా టార్గెట్ చేస్తుంటారు. మంచు మనోజ్ మీద ట్రోలింగ్ పెద్దగా జరగదు. కానీ ఈ మధ్యకాలంలో ఆయనపై కూడా ట్రోలింగ్ జరుగుతోంది. కొన్నాళ్లక్రితం స్టేజ్ పై మాట్లాడే సందర్భంలో నాగబాబుని ఉద్దేశించి హయ్యర్ పర్పస్ ఉపయోగించిన పదం ట్రోలింగ్ కి దారి తీసింది. ఆ తరువాత కొన్నిరోజుల పాటు మనోజ్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేడు.

అయితే ఇప్పుడు మళ్లీ మంచు మనోజ్ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. దానికి కారణం అందులో ఆయన కులంపై చేసిన కామెంట్స్. దీంతో ఇప్పుడు నెటిజన్లు మంచు మనోజ్ ని టార్గెట్ చేస్తున్నారు. ఇంతకీ మనోజ్ తన పోస్ట్ లో ఏం రాశాడంటే..? ”కులాల్లో ఎక్కువ శాతం మీరు బ‌య‌ట‌కు ఎలా క‌నిపిస్తున్నార‌నే దాన్ని అంద‌రూ గ‌మ‌నిస్తారు. డ‌బ్బు, ప‌వ‌ర్, హోదా అనే దాన్ని బ‌ట్టి మీకు స‌మాజంలో గౌర‌వం దొరుకుతుంది. కొంద‌రు ఇందులో క్యారెక్ట‌ర్‌ని చూసి గౌర‌విస్తారు.

మీ ఎదుటి వారిపై చూపించే ద‌య‌, స‌మాన‌త్వం, మాన‌వ‌త్వం అనే దాన్ని బ‌ట్టి మీకు వ్య‌క్తిగా గౌర‌వం ల‌భిస్తుంది” అని రాసుకొచ్చారు. అయితే ఇప్పుడు సడెన్ గా మంచు మనోజ్ కులాల ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చాడనేది ఎవరికీ అర్ధం కాలేదు. మనోజ్ మాత్రం మంచి ఉద్దేశంతోనే ఈ పోస్ట్ పెట్టారు. మనిషి బయటకు కనిపించే విధానంలో కాకుండా అంతర్గతంగా కనిపించే తీరుని బట్టి గౌరవం ఇవ్వాలనేది ఆయన ఉద్దేశం. అయితే నెటిజన్స్ మాత్రం మంచు మనోజ్ పై తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు.

‘మేం హయ్యర్ పర్పస్ బ్రో’ అని ఒకరంటే.. ‘నువ్వేం సాధిస్తావో బ్రో ఇలా వాగుతున్నావ్’ అని మరొకరు కామెంట్ చేశారు. కొందరు మాత్రం ఈ పోస్ట్ పై పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. ఇక మంచు మనోజ్ కెరీర్ విషయానికొస్తే.. రీసెంట్ గా ఆయన నుంచి ఒక సినిమా అనౌన్స్మెంట్ వచ్చింది. ‘వాట్ ది షిట్’ అనే సినిమా చేస్తున్నట్లు వెల్లడించారు మనోజ్. వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. భూమా నాగిరెడ్డి రెండో కూతురు భూమా మౌనికరెడ్డిని మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు టాక్.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus