ఆ క్లాసిక్ రీమేక్ కు మనోజ్ రెడీ అట.. తేజు ఎప్పుడో రెడీ అన్నాడు..!

మెగా ఫ్యామిలీకి… మంచు ఫ్యామిలీకి మంచి సాన్నిహిత్యం ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. చిరు- మోహన్ బాబుల స్నేహం ఎలాంటిదో అనేక వేడుకల్లో మనం చూస్తూనే వచ్చాము. ఇక వీరి వారసులు కూడా ఎంతో స్నేహంగా ఉంటారు. ముఖ్యంగా మంచు మనోజ్.. మెగా హీరోలతో చాలా క్లోజ్ గా మూవ్ అవుతూ ఉంటాడు.గతంలో మనోజ్.. అల్లు అర్జున్ తో కలిసి ‘వేదం’ సినిమాలో కూడా నటించాడు. ఇక సాయి తేజ్ తో అయితే మనోజ్ కు మంచి ఫ్రెండ్ షిప్ ఉంది.

వీరిద్దరూ కలిసి ‘బిల్లా రంగా’ రీమేక్ లో నటించాలని ఎప్పటి నుండో అనుకుంటున్నారట. ఇదే విషయాన్ని సాయి తేజ్ .. గతంలో ‘గుంటూరోడు’ ఆడియో వేడుకలో చెప్పుకొచ్చాడు. ఆ టైములో మంచి డైరెక్టర్ దొరికితే నేను కూడా రెడీ అని మనోజ్ బహిరంగంగా చెప్పుకొచ్చాడు. ఇక నిన్న(అక్టోబర్ 15న) తేజు పుట్టిన రోజు కావడంతో…మనోజ్ విషెస్ చెబుతూ తాను కూడా రెడీ అని సోషల్ మీడియాలో కామెంట్ చేసాడు. ‘బిల్లా రంగా’ చిత్రం విడుదలయ్యి నిన్నటితో(అక్టోబర్ 15తో) 38 సంవత్సరాలు పూర్తికావస్తున్న నేపథ్యంలో మనోజ్ ఈ విషయాన్ని చెప్పుకొచ్చినట్టు తెలుస్తుంది.

చిరంజీవి, మోహన్ బాబు లు.. హీరోలుగా నటించిన ఈ చిత్రం మంచి హిట్ గా నిలిచింది. ఇప్పటి ట్రెండ్ కు తగినట్టు రీమేక్ చేస్తే.. కచ్చితంగా ప్రేక్షకులను అలరించే అవకాశం ఉంది. మరి ఈ రీమేక్ ను ఏ డైరెక్టర్ తెరకెక్కిస్తాడో చూడాలి..!

Most Recommended Video

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus