మంచు విష్ణు …. తన తమ్ముడి లైఫ్ కోసం బాగానే ఆలోచించాడు..!

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కొడుకులుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విష్ణు, మనోజ్ లు వరుస పెట్టి సినిమాలు చేసి ఓకే అనిపించారు కానీ ఊహించిన స్థాయికి ఎదగలేకపోయారు. విష్ణు కి ‘ఢీ’, ‘దేనికైనా రెడీ’ వంటి హిట్లు ఉన్నాయి కానీ… క్రేజ్ లేదు. ఇక మనోజ్ మంచి టేస్ట్ ఉన్న హీరో అనిపించుకున్నాడు… కొద్దిపాటి క్రేజ్ సంపాదించుకున్నాడు కానీ… దానిని ఎక్కువ కాలం కొనసాగించ లేకపోయాడు. ఇతనికి సోషల్ మీడియాలో ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కానీ… ఆ ఫాలో అయ్యేవాళ్లు ఇతని సినిమాలు వస్తే పట్టించుకోరు.

ఇక ఇటీవల తాను విడాకులు తీసుకున్నట్టు తెలిపి అందరికీ షాక్ ఇచ్చాడు మనోజ్. కొన్నాళ్ళు డిప్రెషన్ లో ఉండిపోయానని.. అందుకే సినిమాలకు దూరంగా ఉన్నానని .. ఇక త్వరలో నిర్మాతగా మారి వరుసగా సినిమాలు చేస్తాను అని తెలిపాడు.చెప్పినట్టుగానే.. ‘అహం బ్రహ్మాస్మి’ అనే చిత్రాన్ని మొదలుపెట్టాడు. ఇదిలా ఉండగా… మంచు మనోజ్ విడాకులు తీసుకున్న సమయంలో జరిగిన కొన్ని విషయాల్ని మంచు విష్ణు తెలిపాడు.

అయన మాట్లాడుతూ… ‘మనోజ్ విడాకులు తీసుకున్న టైంలో డిప్రెషన్ కు వెళ్ళిపోయాడు. ఆ టైములో ఓ అన్నగా నేను అతనికి ఓ మాట చెప్పాను.’టేక్ యువర్ ఓన్ టైం’. లైఫ్ ఛేంజింగ్ డెసిషన్ తర్వాత ఎవ్వరైనా డిప్రెషన్ లోనూ అలాగే కన్ఫ్యూజన్ లోనూ ఉండటం సహజం. కంగారు పడి ఏదో ఒక స్టెప్ తీసుకుంటే తప్పు చేసినట్టే..! కాబట్టి టైం తీసుకో..! కాలమే సమాధానం చెబుతుంది… అని చెప్పాను” అంటూ చెప్పుకొచ్చాడు.

Most Recommended Video


నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు
మోస్ట్ డిజైరబుల్ విమెన్ 2019 లిస్ట్
టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019 లిస్ట్
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus