Manchu Vishnu: సోషల్‌ మీడియాలో చాలా క్లారిటీలు ఇచ్చిన మంచు విష్ణు!

మంచు విష్ణు సినిమా అనగానే చాలు… ఎక్కడిలేని ట్రోలింగ్‌, మీమ్స్‌ వచ్చి పడిపోతాయి. వాటి వెనుక ఎవరున్నారు, ఎందుకు చేయిస్తున్నారు, చేస్తే ఏమొస్తుంది అనేవి మంచు విష్ణు చూసుకుంటాడు కానీ.. తాజాగా వచ్చిన ఓ ట్రోల్‌, దానికి మంచు విష్ణు ఇచ్చిన రిప్లై ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇది కూడా ‘జిన్నా’ రిలీజ్‌ గురించి కావడమే విశేషం. విదేశాల్లో అందులోనూ సగటు ప్రేక్షకుడికి పేరు తెలియని దేశాల్లో ఆడుతోందని ఆ మధ్య కొన్ని సినిమాల టీమ్‌ చెప్పుకొచ్చి నవ్వులపాలయ్యాయి.

ఇప్పుడు ‘జిన్నా’ విషయంలోనూ ఓ నెటిజన్‌ మంచు విష్ణుని కామెంట్‌ చేసేలా ప్రశ్నించాడు. ‘కొరియా, చైనా, జపాన్‌లో మీరు సినిమా రిలీజ్‌ చేస్తున్నారా?’ అంటూ కాస్త ఎగతాళిగా అడిగాడు. దీనికి విష్ణు పర్‌ఫెక్ట్‌ రిప్లై ఇచ్చి టిట్‌ ఫర్‌ టాట్‌ అనిపించాడు అని ఫ్యాన్ష్‌ అంటున్నారు. ‘‘అవును, ‘జిన్నా’ సినిమా హక్కులు కొనుగోలు చేసి మీరు విడుదల చేస్తారా?’’ అని తిరిగి ఆ నెటిజన్‌కు తిరిగి ప్రశ్నించి నోరు మూయించాడు విష్ణు.

వీటితోపాటు మరికొన్ని ప్రశ్నలకు కూడా విష్ణు రిప్లైలు ఇచ్చాడు. భవిష్యత్తులో మంచు ఫ్యామిలీ మల్టీస్టారర్ మూవీ చేస్తారా? అని అడిగితే.. ‘ఉండొచ్చు’ అని చెప్పాడు. ఇక మోస్ట్‌ డిస్కష్‌డ్‌ క్వశ్చన్‌ అయిన ‘మీరు చిరంజీవిని అనవసరంగా ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?’ అని అడిగితే ‘‘నేను ఎప్పుడు చిరంజీవిని టార్గెట్‌ చేయలేదు. అలా చేయను కూడా’ అని చెప్పాడు. మరి విష్ణు మాటలు విన్నాక అయినా.. మెగా వర్సెస్‌ మంచు వార్‌ని నెటిజన్లు ఆపుతారేమో చూడాలి.

‘జిన్నా’ తర్వాత ఏంటి అనే ఓ నెటిజన్‌ అడిగితే.. శ్రీను వైట్లతో సినిమా ఉంటుంది అని చెప్పాడు. అయితే ‘ఢీ అండే ఢీ’ ప్రాజెక్టే చేస్తారా? లేక వేరే కథనా అనేది చెప్పలేదు. ఇక అప్పుడెప్పుడో చెప్పిన ‘అసెంబ్లీ రౌడీ’ సినిమా రీమేక్‌ ఏమైంది అని అడిగితే.. ఇప్పట్లో దాని గురించి ఏమీ చెప్పలేను అన్నాడు విష్ణు.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus