Manchu Vishnu: ‘కన్నప్ప’కి మతం రంగు.. విష్ణు మంచు సూపర్‌ క్లారిటీ.. ఇలా చెబితే ఎవరైనా..!

Ad not loaded.

మనిషికే మతం ఉండదు అని ఇప్పుడు అంటున్నారు. అలాంటిది సినిమాకు మతం ఎక్కడిది. ఈ మాట ఇప్పుడు సోషల్‌ మీడియాలో వినిపిస్తోంది. దీనికి కారణం ‘కన్నప్ప’ (Kannappa) సినిమా ప్రచారంలో జరిగిన ఓ కార్యక్రమం, దానికి వచ్చిన రియాక్షన్‌ అలా ఉంది మరి. ‘కన్నప్ప’ సినిమా ప్రచారాన్ని కర్ణాటకలో ప్రారంభించాడు మంచు విష్ణు (Manchu Vishnu). అక్కడే ఈ టాపిక్‌ మీద చర్చ జరిగింది. మంచు విష్ణు కథానాయకుడిగా తెరకెక్కిన భారీ చిత్రం ‘కన్నప్ప’.

Manchu Vishnu

ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా స్టీఫెన్ పనిచేస్తున్నారు. దీంతో హిందూ దేవుళ్లకి సంబంధించిన సినిమా బ్యాక్ డ్రాప్‌కి క్రిస్టియన్ మ్యూజిక్ డైరెక్టర్ ఏంటి అనే విమర్శలు వచ్చాయి. తాజాగా ఈ విషయంలో క్లారిటీ ఇస్తూ మంచు విష్ణు కొన్ని విషయాలు చెప్పుకొచ్చారు. హిందూ ఆధ్యాత్మికతను ఓ క్రిస్టియన్‌ అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా మ్యూజిక్ ఇవ్వగలరా? అనే ప్రశ్నకు విష్ణు ఈ క్లారిటీ ఇచ్చారు.

స్టీఫెన్ అద్భుతమైన సంగీత దర్శకుడు అని, ఈ జనరేషన్ వాళ్లు దేవుడు పాటలు వింటున్నారంటే ఆయన క్రియేట్ చేసిన గణపతి ఆల్బమ్ వల్లనే అని అన్నారు. శంకర్ మహదేవన్ పాడిన గణపతి సాంగ్ ‘ఏకదంతయ వక్రతుండయ’ పాటను ఆర్గనైజ్ చేసి చేసింది స్టీఫెన్ అని చెప్పుకొచ్చారు. ఆయన ఈ సినిమాలో ‘శ్రీకాళహస్తి’ గురించి సూపర్‌ సాంగ్ కంపోజ్ చేశారని కూడా విష్ణు చెప్పారు.

అంతేకాదు ఈ సినిమాకు పర్సనల్ మేకప్‌మ్యాన్ ఒక ముస్లిం అనే విషయం చెప్పారు. నామాలు ఎలా పెట్టాలనే విషయంలో రీసెర్చ్ చేసి అడ్డ నామం, నిలువు నామాల గురించి తెలుసుకున్నారు. విభూది ఎలా రాయాలి, ఒంటికి ఎక్కడ పూయాలి అనే వాటి గురించి కూడా రీసెర్చ్‌ చేశారు. ఎవరు ఎలా పనిచేస్తారని, ఎంత బాగా చేస్తారని అనేదే చూడాలి తప్ప.. మతం కాదు అని విష్ణు చెప్పాడు. ఏప్రిల్ 25, 2025న ఈ సినిమా విడుదల కాబోతుంది.

 జేసీ ప్రభాకర్‌ రెడ్డిపై మాధవీ లత కంప్లైంట్‌… మరి ‘మా’ ఏం చేస్తుందో?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus