Ginna Movie: మళ్ళీ హాట్ టాపిక్ అయిన మంచు విష్ణు కామెంట్స్!

ఒక మాట అనే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడాలి అని పెద్దలు అంటూ ఉంటారు. నిజమే లేకపోతే చాలా అవమానాలు, ఇబ్బందులు ఎదురవుతాయి. సామాన్యులే ఈ విషయాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నప్పుడు.. మోహన్ బాబు తనయుడు, శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల చైర్మన్ అయిన మంచు విష్ణు ఇంకెంత ఆలోచించి మాట్లాడాలి.? హీరోగా ఇతనికి 3,4 హిట్లు ఉన్నాయి. స్టార్ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో ఇండస్ట్రీలో అడుగుపెట్టినా..

స్టార్ హీరోగా ఎదగలేకపోయాడు. ఈ రెండేళ్లలో చూసుకుంటే.. అతను ఎక్కడికి వెళ్లినా ‘మా ప్రెసిడెంట్ ను అయ్యాను’ అంటూనే డబ్బా కొట్టుకుంటున్నాడు. సరే చాలా గొప్ప పొజిషన్ లో ఉన్నాడు. ఒప్పుకోవాలి. అలాంటప్పుడు అతనికి ఎంత హుందాతనం ఉండాలి. కానీ విష్ణు కామెంట్స్ వింటుంటే సెకండ్ క్లాస్ పిల్లలు కూడా నవ్వుకునేలా ఉంటున్నాయి అనడంలో అతిశయోక్తి లేదు. అతనిపై ట్రోలింగ్ జరుగుతుంది అంటూ మీడియా ముందుకు వచ్చి అంటున్నాడు కానీ అతనే.. ట్రోలింగ్ స్టఫ్ ఇస్తున్నాడు అనే విషయాన్ని అతను గమనించడం లేదు.

ఇదిలా ఉండగా.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అతను ‘జిన్నా’ సినిమా గురించి మాట్లాడుతూ.. మధ్యలో ‘ ‘ఢీ’ సినిమా నుండి అతనికి హిందీలో మార్కెట్ ఏర్పడిందని, హిందీలో డబ్ అయిన అతనికి సినిమాలకు భీభత్సమైన వ్యూయర్ షిప్ నమోదవుతుందని, ‘డైనమైట్’ సినిమాకి అయితే నార్త్ లో అత్యధిక టిఆర్పీ లు సాధించిన సినిమాల్లో టాప్ 3 ప్లేస్ ను దక్కించుకుందని’ అన్నాడు.అంతేకాదు ‘అలాంటి వ్యూయర్ షిప్ తెలుగులో వచ్చినా..

లేక ‘జిన్నా’ వంటి సినిమాని హిందీలో రిలీజ్ చేసినా అవి రూ.100 కోట్లు కలెక్ట్ చేసేవి’ అంటూ చెప్పుకొచ్చాడు.దీంతో మంచు విష్ణుని ఓ రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ‘జిన్నా’ సినిమా సంగతి తీసుకుంటే ఆ మూవీ రూ.1 కోటి షేర్ కలెక్ట్ చేయడానికి ఎన్ని తిప్పలు పడుతుందో అందరికీ తెలుసు. అలాంటిది తన సినిమాకి రూ.100 కోట్లు ఎలా వస్తాయి? ఈ విషయం పై అతనికైనా ఒక అవగాహన ఉండాలి కదా..! లేదంటే అతన్ని ఎవరైనా మిస్ లీడ్ చేస్తున్నారా?’ అన్నది అర్థం కాని ప్రశ్న.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus