Manchu Vishnu: రిచా చద్దా పోస్ట్‌పై మంచు విష్ణు ఫైర్‌!

బాలీవుడ్‌ నటి రిచా చద్దా సోషల్‌ మీడియాలో చేసిన ఓ పోస్ట్‌ పెద్ద దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. దేశ సైన్యం మనోధైర్యాన్ని తక్కువ చేసేలా ఉంది అంటూ.. నెటిజన్లు ఆమె సోషల్‌ మీడియా ఖాతాల్లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు నెటిజన్లకు సెలబ్రిటీలు కూడా యాడ్‌ అయ్యారు. కేవలం బాలీవుడ్‌ మాత్రమే కాకుండా.. టాలీవుడ్‌ నుండి కూడా విమర్శలు వస్తున్నాయి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌ (మా) అధ్యక్షుడు, కథానాయకుడు విష్ణు కూడా ఈ విషయంలో ఘాటుగా స్పందించారు.

‘Galwan says hi’ అంటూ ఇటీవల రిచా చద్దా ఓ ట్వీట్‌ చేశారు. దీంతో ఆమె విషంయలో నెటిజన్ల నుండి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తమైంది. ఆమె చేసిన ట్వీట్‌ స్క్రీన్‌ షాట్‌ను తాజాగా మంచు విష్ణు పోస్ట్‌ చేస్తూ.. ‘‘రిచా చద్దాకు ఏమైంది? ఈ విధంగా ఎలా ఆలోచించగలరు? సైనిక బలగాలను మనమంతా గౌరవించాలి. దేశం పట్ల వారి అసామాన్య సేవలను గుర్తించాలి. కృతజ్ఞతాభావం లేని ఇలాంటి వారిని చూస్తుంటే బాధగా ఉంది’’ అని ట్వీట్‌ చేశాడు.

మరోవైపు బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ రిచా చద్దా ట్వీట్‌పై స్పందిస్తూ ‘‘ఈ పోస్ట్‌ చూస్తుంటే బాధగా ఉంది. సాయుధ దళాల పట్ల మనల్ని కృతజ్ఞత లేనివారిగా ఎప్పుడూ మనం ఉండకూదు’’ అని అక్షయ్‌ అన్నాడు. బాలీవుడ్‌ నిర్మాత అశోక్‌ పండిట్‌ అయితే ఏకంగా ఆమెపై చర్యలు తీసుకోవాలంటూ ముంబయిలోని జూహు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

నిఖిల్‌ ఈ విషయంలో ‘‘మనల్ని రక్షించడం కోసం గల్వాన్‌ దాడుల్లో 20 మంది భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయంలో రాజకీయాలు వద్దు. మన ఆర్మీని ఎప్పుడూ గౌరవించాలి. దేశం తర్వాతే ఏదైనా’’ అని నిఖిల్‌ ట్వీట్‌ చేశాడు.

అయితే ఇప్పటికే ఈ విషయంలో రిచా స్పందించింది. ‘‘ఎవరినీ బాధించాలన్నది నా ఉద్దేశం కాదు. ఆ మూడు పదాలు ఎవరినైనా బాధపెట్టి ఉంటే నన్ను క్షమించండి’’ అని పోస్ట్‌ చేసింది. అంతేకాదు తన తాత సైన్యంలో పనిచేశారని, చైనాతో యుద్ధంలో దేశం కోసం పోరాడినట్టు తెలిపింది. అయితే ఇకనైనా రిచాపై ఈ మాటల దాడి ఆగుతుందేమో చూడాలి.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus