Manchu Vishnu: వెన్నెల కిషోర్ ఇంట్లో 2 వేల నోట్లకట్లు.. అసలు విషయం బయట పెట్టిన మంచి విషయం!

Ad not loaded.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2000 రూపాయల నోట్లను రద్దు చేసిన విషయం మనకు తెలిసిందే. ఇక ఎవరి వద్ద అయినా కూడా 2000 రూపాయల నోట్లు ఉంటే వాటిని సెప్టెంబర్ 30వ తేదీ వరకు మార్పు చేసుకోవచ్చంటూ సమయం కూడా ఇచ్చింది. ఈ క్రమంలోనే 2000 నోట్లు రద్దు అవుతున్నాయని తెలియడంతో పెద్ద ఎత్తున ఈ నోట్ల గురించి ఫన్నీ మీమ్స్ సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి.ఇక ఎవరి వద్దన్న 2000 రూపాయలు నోట్లు ఉంటే కనుక వాటిని మార్చుకునే పనిలో ఉన్నారు.

ఈ క్రమంలోనే తాజాగా మంచు విష్ణు వెన్నెల కిషోర్ ఇంట్లో కట్టలు కట్టలుగా 2000 రూపాయల నోట్లు ఉన్నాయంటూ ఒక ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.తాను వెన్నెల కిషోర్ ఇంటికి వెళ్ళినప్పుడు ఇలా కట్టలుగా 2000 రూపాయల నోట్లో ఉండడం తాను చూసానని అయితే ఇప్పుడు వాటితో వెన్నెల కిషోర్ ఏం చేయబోతున్నారు అంటూ సోషల్ మీడియా వేదికగా మంచు విష్ణు చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది.

ఇలా మంచు విష్ణు ఈ ఫోటోని షేర్ చేయడంతో నేటిజన్స్ ఈ ఫోటోపై వివిధ రకాలుగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. అన్న మాకు ఒక కట్ట ఇయ్యరాదే అంటూ కొందరు కామెంట్లు చేయగా మరికొందరు ఇంకేం చేస్తారు ఇన్కమ్ టాక్స్ రైట్ చేస్తారు అంటూ ఫన్నీ కామెంట్ చేస్తున్నారు. ఇలా నేటిజన్స్ నుంచి వివిధ రకాలుగా కామెంట్స్ రావడంతో స్పందించిన వెన్నెల కిషోర్ అయినా మీరంతా నా మీద పడతారేంటీ అంటూ రిప్లై ఇచ్చారు.

ఇకపోతే వెన్నెల కిషోర్ మంచు విష్ణు (Manchu Vishnu) ఇద్దరు కూడా మంచి స్నేహితులనే విషయం మనకు తెలిసిందే ఇలా వీరి మధ్య ఉన్నటువంటి ఈ స్నేహబంధంతో మంచు మనోజ్ సరదాగా ఇలా ట్వీట్ చేశారని తెలుస్తోంది. గతంలోనూ వీరి మధ్య ఇలాంటి సరదా సన్నివేశాలు, సెటైర్లు, ట్వీట్లు ఉన్నాయి. ఈ క్రమంలో వెన్నెల కిషోర్‌ను ఆట పట్టించడానికే మంచు విష్ణు ఇలా ట్వీట్‌ చేశాడనీ అర్థమవుతుంది.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus