Manchu Vishnu: హాట్ టాపిక్ గా మారిన మంచు విష్ణు లేటెస్ట్ ట్వీట్!

మోహన్ బాబు పెద్ద కొడుకు మంచు విష్ణు… ప్రస్తుతం ‘మా'( మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్) గా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మరోపక్క అతను వరుస సినిమాల్లో కూడా నటిస్తున్నాడు.ఈ మధ్యనే ‘జిన్నా’ చిత్రంతో అతను ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.సినిమాకి పర్వాలేదనిపించే విధంగా టాక్ వచ్చింది కానీ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఏంటో అందరికీ తెలిసిందేగా..! సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే… మంచు విష్ణు తన పై వచ్చే ట్రోలింగ్ పై నెగిటివ్ గా స్పందించడు కానీ ఆ ఛానల్ ను,

ఈ ఛానల్ ను మూయించేస్తా అంటూ చేసే కామెంట్స్ కు నెటిజన్లు రెచ్చిపోయి మరీ ట్రోల్ చేస్తూ ఉండడం మనం చూస్తూనే వస్తున్నాం. అయితే సోషల్ మీడియాలో మాత్రం విష్ణు చాలా సరదాగా ఉంటాడు. తన కొత్త ఫోటోలను,ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటూ ఉంటాడు. ఇదిలా ఉండగా.. తాజాగా ‘ఎదుగుదలకు ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడం లేదు’ అంటూ విష్ణు తన ట్విట్టర్లో పేర్కొన్నాడు. ఎవరి ఎదుగుదలను అయినా ఫ్యామిలీ మెంబెర్స్ అడ్డుకుంటారా? ఏంటి?.. అయితే మంచు విష్ణు చెప్పే ఎదుగుదల గడ్డం గురించి..!

విష్ణుకి గుబురు గడ్డంతో ఉండడం ఇష్టం. కానీ సినిమాల గురించి లుక్ మార్చాల్సి వస్తుందేమో అని అనుకుంటే పొరపాటే! అతను గడ్డం పెంచడానికి ఇంట్లో పర్మిషన్ ఇవ్వడం లేదట.. హోం డిపార్ట్మెంట్ ఒప్పుకోవడం లేదు అంటూ పరోక్షంగా తన భార్య విన్ని గురించి విష్ణు ఇలా చెప్పుకొచ్చాడు. దీనికి నెటిజన్లు ‘హోం డిపార్ట్మెంట్‌లో సన్నీ ఉందా?’ ‘హోం డిపార్ట్మెంట్‌ ను మార్చేసెయ్యి అన్నా’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. దీంతో విష్ణు పోస్ట్ వైరల్ గా మారింది.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus