Manchu Vishnu: మంచు విష్ణు ప్లాన్ వర్కౌట్ అయితే రూ.500 కోట్లు గ్యారంటీ.. కానీ?

మంచు విష్ణు భక్త కన్నప్ప సినిమాను ప్రకటించిన సమయంలో ఈ సినిమాపై పెద్దగా అంచనాలు ఏర్పడలేదు. అయితే ఈ సినిమాలో ప్రభాస్ శివుడి పాత్రలో కనిపించనున్నారని ప్రకటన వెలువడిన వెంటనే ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి. ఈ సినిమాలో పార్వతి పాత్రలో నయనతార కనిపించనున్నారని తెలుస్తోంది. యోగి సినిమా తర్వాత ప్రభాస్ నయనతార కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ ఇదే కావడం గమనార్హం. మంచు విష్ణు ఈ సినిమాలో ఇతర భాషల నటీనటులకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుస్తోంది.

ఈ సినిమాకు 500 కోట్ల రూపాయల కలెక్షన్లు గ్యారంటీ అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే మంచు విష్ణు ఈ సినిమాను భారీ లెవెల్ లో ప్లాన్ చేశారని తెలుస్తోంది. ఈ సినిమా కోసం విష్ణు న్యూజిలాండ్ కు 8 కంటైనర్లను తరలించాడని సమాచారం అందుతోంది. ఈ సినిమాకు హీరోయిన్ గా ఎంపికైన నుపుర్ సనన్ ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. ఆమె స్థానంలో మరో హీరోయిన్ కోసం అన్వేషణ కొనసాగుతుండగా ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు ఎంపికవుతారో చూడాల్సి ఉంది.

సింగిల్ షెడ్యూల్ లో ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేయనున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. సెట్స్ కు సంబంధించిన సామాగ్రి, ఆయుధాలను 8 కంటైనర్లలో తరలించారని భోగట్టా. 800 మంది సిబ్బంది ఈ సినిమా కోసం పని చేస్తున్నారు. ఈ సినిమా బడ్జెట్, క్వాలిటీ విషయంలో మంచు విష్ణు ఏ మాత్రం రాజీ పడటం లేదని తెలుస్తోంది.

మంచు విష్ణు సొంత బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం మంచు విష్ణు ఒక విధంగా కెరీర్ ను రిస్క్ లో పెడుతున్నారని సమాచారం అందుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర నిడివి 10 నిమిషాలు అని తెలుస్తోంది. సినిమా సినిమాకు మంచు విష్ణుకు ఊహించని స్థాయిలో క్రేజ్ పెరుగుతోంది.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus