Manchu Vishnu: పెద్ద చర్చకు దారి తీసిన మంచు విష్ణు ట్వీట్..ఏమైందంటే?

Ad not loaded.

మంచు విష్ణు(Manchu Vishnu)  చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా హాట్ టాపిక్ గా మారింది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్  (Prabhas) హీరోగా అర్జున్ రెడ్డి (Arjun Reddy) ఫేమ్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ (Spirit)సినిమాలో ఛాన్స్ కోసం మంచు విష్ణు చేసిన కామెంట్ అందరి దృష్టిని ఆకర్షించింది.’స్పిరిట్’ మూవీలో నటీనటుల కోసం రీసెంట్ గా ఒక కాస్టింగ్ కాల్ పెట్టింది టీం. ‘భద్రకాళి పిక్చర్స్’ బ్యానర్ వారు “ప్రభాస్ ‘స్పిరిట్’ సినిమాలో నటించాలనుకునే వారికి సూపర్ ఛాన్స్ ఇచ్చింది.

Manchu Vishnu

ఏ వయసు వారైనా సరే.. లేడీస్ అయినా, జెంట్స్ అయినా.. మీ టాలెంట్ నిరూపించుకోవచ్చు అని పిలుపునిచ్చింది.. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు రెండు ఫోటోలు, రెండు నిమిషాల ఇంట్రో వీడియో రెడీ spirit.bhadrakalipictures@gmail.comకి ఈమెయిల్ చేసేయండి!” అంటూ తమ అఫీషియల్ హ్యాండిల్ నుండి ఒక ఫోటోని షేర్ చేశారు. ఈ కాస్టింగ్ కాల్ కి మంచు విష్ణు ఫన్నీగా స్పందిస్తూ.. “నేను కూడా అప్లై చేశాను.

వెయిట్ అండ్ సీ” అంటూ ట్వీట్ చేశారు. అయితే ఇందులో విశేషం ఏముంది అనుకుంటున్నారా? మంచు విష్ణు హీరోగా నటిస్తున్న ‘కన్నప్ప’ (Kannappa) సినిమాలో ప్రభాస్ కూడా ఒక స్పెషల్ రోల్ లో కనిపించబోతున్నారు. దీంతో చాలా మంది నెటిజన్లు విష్ణు చేసిన ఈ కామెంట్ పై భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు సరదాగా తీసుకుంటే, మరికొందరు మాత్రం ‘విష్ణు కావాలనే ఇలాంటి కామెంట్స్ చేస్తున్నాడని’ చెప్పుకుంటున్నారు.

”స్పిరిట్’ లాంటి సినిమాలో విష్ణుకి ఛాన్స్ ఇవ్వాలంటే డైరెక్ట్ గానే ఆఫర్ ఇస్తారు కానీ ఇలా కాస్టింగ్ కాల్ ద్వారా రమ్మనరు కదా’ అనేది కొందరి అభిప్రాయం.మొత్తానికి మంచు విష్ణు కామెంట్ ఇప్పుడు పెద్ద చర్చకే దారితీసింది అని చెప్పాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus