తెలుగు ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. హీరోయిన్ల విషయంలో అభ్యంతరకర వీడియోలు పెడితే ఊరుకునేదే లేదని అన్నారు. కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ నటుల విషయంలో దారుణంగా ప్రవర్తిస్తున్నాయని.. అలాంటి వారిని వెతికి పట్టుకొని కఠిన చర్యలు తీసుకుంటున్నారని అన్నారు విష్ణు.
ముఖ్యంగా యూట్యూబ్ ఛానెల్స్ థంబ్‌నైల్స్ హద్దులు మీరుతున్నాయని.. అలా అసభ్యకరంగా వ్యవహరించే ఛానెల్స్ పై చర్యలు తప్పవని విష్ణు చెప్పారు. హీరోయిన్స్ అంటే మన ఆడపడుచులని.. వారిని గౌరవించాలని రిక్వెస్ట్ చేశారు. అలాంటి హీరోయిన్లపై అభ్యంతరకర వీడియోలు పెడితే ఊరుకునేది లేదంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
యూట్యూబ్ ఛానెల్స్ నియంత్రణకు.. వాటిపై నిఘా పెట్టేందుకు గాను ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేసి లీగల్ సెల్ ఏర్పాటు చేస్తామని విష్ణు అన్నారు. ఇప్పటికే ఈ విషయమై యూట్యూబ్ తో డిస్కస్ చేశామని.. తప్పుగా వ్యవహరించే అన్ని ఛానెల్స్ పై చర్యలు తీసుకోవడం పక్కా అని అన్నారు. తెలుగు మీడియా ఎప్పుడూ హద్దులు దాటలేదని, తన కుటుంబానికి, చిత్ర పరిశ్రమకి సహకారం అందిస్తూనే ఉందని చెప్పారు.