Manchu Vishnu: భార్యకు మంచు విష్ణు ఇచ్చిన సర్ప్రైజ్ ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ హీరోలలో మంచు విష్ణు ఒకరు కాగా ప్రస్తుతం మంచు విష్ణు షూటింగ్ కోసం న్యూజిలాండ్ కు వెళ్లారు. ప్రస్తుతం న్యూజిలాండ్ లో కన్నప్ప సినిమా సెకండ్ షెడ్యూల్ షూట్ జరుగుతోంది. కన్నప్ప మూవీ బడ్జెట్ 150 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం కాగా ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకుంటానని విష్ణు కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. అయితే విష్ణు తాజాగా భార్యకు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు.

15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా విష్ణు (Manchu Vishnu) భార్య విరోనికాకు హెలికాఫ్టర్ లో న్యూజిలాండ్ లో అద్భుతమైన లొకేషన్లను చూపించారు. విరోనికా సోషల్ మీడియా ద్వారా ఈ వీడియోను పంచుకోగా ఈ వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. భర్త ఇచ్చిన సర్ప్రైజ్ ను చూసి విరోనికా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ ఇన్ స్టాగ్రామ్ వీడియోకు 2 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి.

శివుడి భక్తుడైన కన్నప్ప జీవితం ఆధారంగా కన్నప్ప మూవీ తెరకెక్కుతుండగా ప్రభాస్ ఈ సినిమాలో కొన్ని నిమిషాల పాటు కనిపిస్తారనే వార్త ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. కన్నప్ప సినిమాలో చిరంజీవి, బాలయ్య కూడా కనిపిస్తారని ప్రచారం జరుగుతున్నా మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. కన్నప్ప సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని సమాచారం అందుతోంది.

ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ ఏడాది సెకండాఫ్ లో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో విజువల్ ఎఫెక్స్ట్ కు ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది. ఇతర భాషల్లో సైతం ఈ సినిమా రికార్డ్ స్థాయిలో రిలీజ్ కానుందని తెలుస్తోంది. మంచు విష్ణు ఈ సినిమాతో పాన్ ఇండియా హిట్ సాధిస్తారేమో చూడాల్సి ఉంది. ఈ సినిమాకు భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఆపరేషన్ వాలెంటైన్ సినిమా రివ్యూ & రేటింగ్!

భూతద్ధం భాస్కర్ నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!
చారి 111 సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus