Manchu Vishnu: నేను నటించిన ఆ సినిమాలు మాత్రమే రూ.30 కోట్లు, రూ.40 కోట్లు కలెక్ట్ చేశాయి: మంచు విష్ణు

మంచు విష్ణు హీరోగా పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ హీరోయిన్లుగా ఈషాన్ సూర్య దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘జిన్నా’. దీపావళి కానుకగా అక్టోబర్ 21న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు పాజిటివ్ టాక్ అయితే వచ్చింది కానీ బాక్సాఫీసు వద్ద కలెక్షన్లు మాత్రం చాలా దారుణంగా నమోదయ్యాయి. హారర్ కామెడీ జోనర్లో రూపొందిన ఈ మూవీ రిలీజ్ అయ్యి 5 రోజులు కావస్తున్నా ఇంకా కోటి రూపాయల షేర్ ను కూడా రాబట్టలేకపోయింది.

దీంతో మంచు విష్ణు పై మళ్ళీ ట్రోల్స్ మొదలయ్యాయి. చెప్పుకోడానికి అతను మా ప్రెసిడెంట్ గా ఉన్నాడు కానీ.. సోషల్ మీడియా జనాలు మాత్రం అతన్ని ట్రోలింగ్ స్టఫ్ గానే చూస్తున్నారు.ఇదిలా ఉంటే.. ఓవర్సీస్ లో ‘జిన్నా’ చిత్రానికి కనీసం 2 వేల డాలర్లు కూడా నమోదు కాలేదు అని అక్కడి ట్రాకింగ్ అఫీషియల్ ఖాతాలు చెప్పుకొస్తున్నాయి. ఈ విషయాలను పక్కన పెట్టేస్తే తాజాగా విష్ణు పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ‘నేను కలెక్షన్ కింగ్’ కాదు అంటూ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి.

విష్ణు మాట్లాడుతూ.. “నాన్నగారి వారసులుగా నేను, మనోజ్ ఇండస్ట్రీకి వచ్చామని చాలా మంది మమ్మల్ని ఆయనతో పోల్చుతుంటారు. కానీ.. మేమెప్పుడూ ఆయనకంటే తక్కువ రేంజ్లోనే ఉంటాం. నాన్నగారు చేసిన విభిన్నమైన క్యారెక్టర్స్ లో నేను కొన్ని కూడా చేయలేదు. అలాంటి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నాను. ఆయన చూసిన సూపర్ హిట్స్ నేను ఇంకా చూడలేదు.

నా సినిమాల్లో దేనికైనా రెడీ, దూసుకెళ్తా.. ఇలాంటి రెండు మూడు సినిమాలే 30, 40 కోట్ల వరకూ కలెక్ట్ చేశాయి. కానీ.. నాన్నగారి కెరీర్ లో 8,9 ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి. రాయలసీమ రామన్న చౌదరి వంటి పాత్రలు లార్జర్ దేన్ లైఫ్ అనే విధంగా ఉంటాయి.ఆయన ‘కలెక్షన్ కింగ్’ బిరుదు పొందడానికి నేనింకా అర్హుడిని కాదు. ఫ్యూచర్ లో వస్తుందేమో చూడాలి” అంటూ చెప్పుకొచ్చాడు.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus