Sivasankar Master: డాన్స్ మాస్టర్ కోసం రంగంలోకి దిగిన ‘మా’ ప్రెసిడెంట్!

ప్రముఖ కొరియోగ్రాఫర్, జాతీయ అవార్డు గ్రహీత శివ శంకర్ మాస్టర్ ఆరోగ్యం విషమంగా ఉన్న సంగతి తెలిసిందే. కరోనా బారిన పడిన ఆయన ప్రస్తుతం హైదరాబాద్ లోని ఏఐజీ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. ఆయన ఊపిరితిత్తులు పాడయ్యాయని.. ఆరోగ్య పరిస్థితి విషమించిందని డాక్టర్లు చెబుతున్నారు. శివశంకర్ మాస్టర్ మాత్రమే కాకుండా.. ఆయన కుటుంబసభ్యులు భార్య, పెద్ద కుమారుడు కూడా కరోనా బారిన పడ్డారు. ఈ క్రమంలో వారి ట్రీట్మెంట్ కోసం ఆర్ధిక సాయం చేయాల్సిందిగా చిన్న కుమారుడు అజయ్ సినీ పెద్దలను కోరారు.

దీంతో సోనూసూద్, ధనుష్ లాంటి తారలు ముందుకొచ్చారు. సోనూసూద్.. శివశంకర్ మాస్టర్ కొడుకుతో టచ్ లో ఉన్నారు. తాజాగా నటుడు, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు సైతం స్పందించారు. శివశంకర్ మాస్టర్ ఆరోగ్యంపై ఏఐజీ వైద్యులతో మాట్లాడినట్లు.. ఆయన ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. శివశంకర్ మాస్టర్ ఆరోగ్యంపై ఆరా తీశానని.. ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరినట్లు చెప్పారు.

మాస్టర్‌ చిన్న కుమారుడు అజయ్‌తో కూడా ఫోన్‌లో మాట్లాడాడి ధైర్యం చెప్పానని.. అలాగే శివశంకర్ మాస్టర్ కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus