మణికర్ణిక

వీరవనిత రాణి ఝాన్సీ లక్ష్మీ భాయ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం “మణికర్ణిక”. 60% పైగా క్రిష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అనంతరం కారణాంతరాల వలన కంగనా దర్శకత్వ బాధ్యతలు స్వీకరించింది. బ్రిటీష్ దొరల గుండెల్లో నిద్రపోయిన ఏకైక యోధురాలిగా పేరున్న ఝాన్సీలక్ష్మీ భాయ్ జీవితాన్ని క్రిష్-కంగనాలు ఎంత చక్కగా తెరపై ప్రెజంట్ చేశారు అనేది చూద్దాం..!!

కథ: 1828లో పుట్టిన మణికర్ణిక ఝాన్సీ రాజ్యానికి రాజైన రాజా గంగాధర్ నెవాల్కర్ ను పెళ్లాడి లక్ష్మీభాయ్ గా మారిన తీరు.. అనంతరం ఝాన్సీ రాజ్యాంపై ఆధిపత్యం కోసం ప్రయత్నించిన బ్రిటీష్ వారిని ఎదిరించి.. పోరాడి 1858లో వీరమరణం పొందింది అనేది “మణికర్ణిక” కథాంశం.

నటీనటుల పనితీరు: కంగనా అద్భుతమైన నటి అనే విషయం అందరికీ తెలిసిందే. అందుకు తగ్గట్లే.. మంచి స్క్రీన్ ప్రెజన్స్ తో ఝాన్సీ లక్ష్మీభాయ్ పాత్రకు ప్రాణ ప్రతిష్ట చేసింది కంగనా. కాకపోతే.. కొన్ని సన్నివేశాల్లో మాత్రం అవసరాణికించి మించి అభినయించినట్లుగా కనిపిస్తుంది.

మిగతా ఆర్టిస్టులందరూ పర్వాలేదనిపించినా.. కంగనా ముందు తేలిపోయారు.

సాంకేతికవర్గం పనితీరు: ఒక అద్వితీయమైన చరిత్రను ఆకట్టుకొనే విధంగా చెప్పడంలో కథా రచయితగా విజయేంద్రప్రసాద్.. దర్శకులుగా క్రిష్-కంగనాలు ఫెయిల్ అయ్యారు. సాధారణంగా చిన్నప్పుడు తెలుగు టెక్స్ట్ బుక్స్ లో చదివేప్పుడే చాలా ఇన్స్పైరింగ్ గా అనిపించే లక్ష్మీభాయ్ జీవిత చరిత్ర తెరపై చాలా పేలవంగా కనిపించింది. ముఖ్యంగా.. ఝాన్సీ రాజ్యం నుంచి లక్ష్మీభాయ్ తన కుమారుడ్ని తీసుకొని శత్రు సైన్యాన్ని చీల్చుకుంటూ బయటకు వెళ్ళే సందర్భం, గ్వాలియర్ కోటను స్వాధీన పరుచుకొనే సందర్భం మరియు అతి స్వల్పమైన సైన్యంతో వేలాది మంది బ్రిటీష్ సైనికులను ఎదిరించే సందర్భాలు బుక్స్ లో చదువుతున్నప్పుడే రోమాలు నిక్కబొడుచుకొనేలా ఉంటాయి. అలాంటి సన్నివేశాలు కూడా పూర్ గ్రాఫిక్స్ వర్క్ కారణంగా చాలా వీక్ గా కనిపిస్తాయి.

కెమెరా వర్క్, సంగీతం, ఆర్ట్ వర్క్ లాంటి కీలకమైన విషయాలన్నీ చాలా పేలవంగా ఉన్నాయి. ఇక సరైన స్క్రీన్ ప్లే లేకపోవడంతో సగటు ప్రేక్షకుడు సినిమా అటు ఎంజాయ్ చేయలేక.. కథనానికి ఎంగేజ్ అవ్వలేక చతికిలపడతాడు.

విశ్లేషణ: చరిత్ర చెప్పడానికి ఎలివేషన్స్ అవసరం లేదు కానీ.. సరైన కథనం చాలా అవసరం. ఈ విషయాన్ని గ్రహించకపోతే.. ఎంత గొప్ప చరిత్రైనా ఒక రొటీన్ సినిమాలా కనిపిస్తుంది. “మణికర్ణిక” సినిమా విషయంలోనూ అదే జరిగింది. అందుకే ఈ చిత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కంగనా మినహా మరో ప్రత్యేక ఆకర్షణ లేని “మణికర్ణిక”ను థియేటర్లో రెండున్నర గంటలపాటు చూడాలంటే సహనం చాలా అవసరం.

రేటింగ్: 1.5/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus