పవన్ కల్యాణ్ ఇప్పుడు సినిమాలు చేస్తారా, ఇప్పటివరకు ఓకే చేసిన సినిమాలు పూర్తి చేసి పూర్తిగా రాజకీయాల మీదే దృష్టిపెడతారు అని అనుకున్నారంతా. అయితే ‘ఓజీ’ సినిమా సక్సెస్ మీట్‌లో ‘నేను సినిమాలు చేయడానికి రెడీ’ అంటూ సినిమా అభిమానుల మనసు ఖుషీ చేశాడు. అయితే ఆ తర్వాత ఇప్పటివరకు పవన్ కొత్త సినిమా అంటూ ఏదీ అఫీషియల్‌గా అనౌన్స్ కాలేదు. అయితే దీనికి సంబంధించిన పనులు అయితే బ్యాగ్రౌండ్‌లో జరుగుతున్నాయట. ఈ క్రమంలో రెండు ప్రాజెక్ట్‌లు.. ముగ్గురు దర్శకులు.. నలుగురు నిర్మాతలు.. అనే మాట వినిపిస్తోంది.
పవన్ కల్యాణ్‌ను గత కొన్ని నెలలుగా చూసతున్నవారికి ఆ ప్రాజెక్ట్‌లు ఏంటి, ఆ దర్శకులు ఎవరు, ఆ నిర్మాతలు ఎవరు అనేది అర్థమైపోతుంది. ఈ ఫార్ములాను వెనుక నుండి చూసుకుంటే తొలుత నిర్మాతల గురించి మాట్లాడాలి. పవన్ కల్యాణ్ ఇప్పటికే రామ్ తాళ్లూరి అడ్వాన్స్ పవన్ కల్యాణ్ దగ్గర ఉంది. ఆయన కాకుండా పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి పవన్ ఓ సినిమా చేయాల్సి ఉంది. ఈ ఇద్దరు కాకుండా దిల్ రాజుకు ఓ సినిమా చేస్తారనే చర్చ చాలా రోజులుగా సాగుతోంది.
కోలీవుడ్ నుండి కొత్తగా టాలీవుడ్‌కి వచ్చిన కేవీఎన్ ప్రొడక్షన్స్ కూడా ఓ సినిమా చేస్తారని టాక్. ఇక దర్శకుల విషయానికొస్తే.. రామ్ తాళ్లూరి సినిమాను సురేందర్ రెడ్డి హ్యాండిల్ చేస్తారని అనౌన్స్‌మెంట్ సమయంలోనే చెప్పేశారు. ఇక పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సినిమాకు సముద్రఖని దర్శకత్వం వహిస్తారని సమాచారం. కేవీఎన్ ప్రొడక్షన్ సినిమాకు అయితే తమిళ దర్శకుడిని అనుకుంటున్నారట.
దిల్ రాజు అయితే అనిల్ రావిపూడి, వంశీ పైడిపల్లి లాంటి దర్శకులను అనుకుంటున్నారట. ఈ సినిమాలు కాకుందా ‘హరి హర వీరమల్లు 2’, ‘ఓజీ 2’ సినిమాలు ఉన్నాయి. ఇందులో తొలి సినిమా వచ్చే అవకాశం లేదు అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే పైన చెప్పిన సమీకరణాలు అన్నీ తేలితే వచ్చే ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందే రెండు సినిమాలు చేయాలని పవన్ అనుకుంటున్నారట.