డ్యాన్సర్ గా, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న బిగ్ బాస్ కంటెస్టెంట్ మనీషా రాణి హిందీ బిగ్ బాస్ ఓటీటీ సెకండ్ సీజన్ లో సెకండ్ రన్నరప్ గా నిలిచారు. ఝలక్ దిల్ లాజా అనే డ్యాన్స్ రియాలిటీ షోలో ఆమె వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా ఆ షోలో ఎంట్రీ ఇచ్చినా చివరకు ట్రోఫీ అందుకోవడం గమనార్హం. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ తండ్రికి ఖరీదైన కారును బహుమతిగా ఇవ్వడం ద్వారా వార్తల్లో నిలిచారు.
మనీషా రాణి తండ్రికి ఖరీదైన మహీంద్రా కారును బహుమతిగా ఇచ్చారు. ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఆమె ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేయడం జరిగింది. తండ్రికి కారు తాళాలను అందిస్తూ మనీషా రాణి మురిసిపోయింది. ఈ కారు మా నాన్న కొత్త కారు అని ఆమె పేర్కొన్నారు. నాన్న కోరిక నెరవేర్చుతూ కారు బహుమతిగా ఇచ్చానని మనీషా రాణి వెల్లడించారు.
నాన్న కన్న కలలు తనవి మాత్రమే కాదని నావి కూడా అంటూ ఆమె కామెంట్లు చేశారు. నాన్న కలలన్నీ నెరవేరుస్తానని ఆమె క్యాప్షన్ లో పేర్కొన్నారు. ఈ కారు ఎక్స్ షోరూమ్ ధర 8 నుంచి 16 లక్షల రూపాయల మధ్యలో ఉంటుందని సమాచారం అందుతోంది. మనీషా రాణిని నెటిజన్లు ఎంతో మెచ్చుకుంటున్నారు. మనీషా రాణిని చూస్తే గర్వంగా ఉందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
ఎంతోమంది మధ్యతరగతి అమ్మాయిలకు మనీషా రాణి రోల్ మోడల్ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రతి ఒక్కరికీ నీలాంటి కూతురు ఉండాలంటూ కొంతమంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. మనీషా రాణి సోషల్ మీడియా పోస్ట్ కు 9 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి.