రజినీకాంత్, నాగార్జున కాంబినేషన్లో రూపొందిన యాక్షన్ మూవీ ‘కూలీ’. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం పై మొదటి నుండి అంచనాలు ఓ రేంజ్లో నెలకొన్నాయి. దీంతో మొదటి నుండి సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అయితే భారీ అంచనాల నడుమ ఆగస్టు 14న రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి షోతోనే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది.
రజినీకాంత్, నాగార్జున స్క్రీన్ ప్రెజెన్స్ తో మాయ చేయాలని చూసినా లోకేష్ కనగరాజ్ వీక్ రైటింగ్ వల్ల అది వర్కౌట్ కాలేదు. అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం లోపాలను కవర్ చేసే ప్రయత్నం చేసింది. ఇక బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ లో భాగంగా.. మొదటి వీకెండ్ అద్భుతంగా క్యాష్ చేసుకున్న ఈ సినిమా వీక్ డేస్ లో డౌన్ అయ్యింది. తర్వాత వీకెండ్స్ లో, హాలిడేస్ లో కొంత ఇంపాక్ట్ చూపిస్తూ వస్తోంది. 3వ వీకెండ్ ను కూడా ఈ సినిమా క్యాష్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఒకసారి ‘కూలీ’ 15 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 15.72 cr |
సీడెడ్ | 6.22 cr |
ఉత్తరాంధ్ర | 5.44 cr |
ఈస్ట్ | 2.82 cr |
వెస్ట్ | 2.31 cr |
గుంటూరు | 2.96 cr |
కృష్ణా | 2.76 cr |
నెల్లూరు | 1.63 cr |
ఏపీ+తెలంగాణ టోటల్ | 39.86 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా(తెలుగు వెర్షన్) | 2.63 cr |
ఓవర్సీస్(తెలుగు వెర్షన్) | 3.52 cr |
టోటల్ వరల్డ్ వైడ్(తెలుగు వెర్షన్) | 46.01(షేర్) |
‘కూలీ'(తెలుగు వెర్షన్) చిత్రానికి రూ.46.2 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కొరకు రూ.47 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 15 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.46.01 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా చూసుకుంటే రూ.79.23 కోట్లు కొల్లగొట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో 0.99 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.