‘నరసింహ నాయుడు’లో బాలకృష్ణతో కలిసి ‘లక్స్ పాప’ అంటూ స్టెప్పులేసిన ఫ్లోరా షైని (ఆశా షైనీ) అందరికీ గుర్తుంది కదా? ఇన్నాళ్ల తర్వాత ఆమె ఇప్పుడు బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టబోతోంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో కంటెస్టెంట్‌గా ఫ్లోరా షైని ఎంట్రీ దాదాపు ఖరారైంది. దీంతో అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి అని చెప్పాలి.
ఒకప్పుడు తెలుగులో ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘143’ వంటి సినిమాలతో మెప్పించిన ఆశా, ఆ తర్వాత బాలీవుడ్‌లో ‘స్త్రీ’ వంటి హిట్స్‌తో పాటు పలు బోల్డ్ వెబ్ సిరీస్‌లలో నటించి సంచలనం సృష్టించింది. తన బోల్డ్ పర్సనాలిటీతో ఆమె హౌస్‌లోకి వస్తుండటంతో, ఈసారి గ్లామర్, డ్రామా, కాంట్రవర్సీలకు కొదవ ఉండదు అని ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు.
సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభం కానున్న ఈ సీజన్‌లో, ఫ్లోరా సైని తన గేమ్ ప్లాన్‌తో హౌస్‌ను ఎలా షేక్ చేయబోతోందో చూడాలని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆమె ఎంట్రీతో ఈ సీజన్ టీఆర్పీ(TRP) రేటింగ్స్ కూడా పెరగడం ఖాయమని టాక్ వినిపిస్తోంది.దక్షిణాదిలో ఒకప్పుడు స్టార్‌డమ్ చూసిన ఈ బ్యూటీ, ఆ తర్వాత బాలీవుడ్, ఓటీటీల్లోకి వెళ్లి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన ఫ్లోరా, నిక్కచ్చిగా మాట్లాడే తత్వానికి, వివాదాలకు భయపడని తీరుకు పెట్టింది పేరు. అందుకే, ఆమె ఎంట్రీతో షోకు మరింత మసాలా యాడ్ అవ్వడం గ్యారంటీ. హౌస్‌లోని మిగతా కంటెస్టెంట్లకు ఆమె గట్టిపోటీ ఇవ్వడం ఖాయమని, బిగ్ బాస్ ద్వారా తెలుగులో తన సెకండ్ ఇన్నింగ్స్‌ను గ్రాండ్‌గా స్టార్ట్ చేస్తుందని అంచనాలు వినిపిస్తున్నాయి