స్టార్ యాంకర్ సుమ తనయుడు రోషన్ కనకాల హీరోగా ‘బబుల్ గమ్’ అనే సినిమా వచ్చింది. అది పెద్దగా ఆడలేదు. దీంతో కొంత గ్యాప్ తీసుకుని ‘మోగ్లీ’ చేశాడు. ‘కలర్ ఫోటో’ తో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకుని నేషనల్ అవార్డు గెలుచుకున్న సందీప్ రాజ్ ఈ చిత్రానికి దర్శకుడు. వీరిద్దరికీ కూడా ఇది 2వ సినిమా కావడం విశేషం. ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. తాజాగా టీజర్ ని వదిలారు.
Mowgli Glimpse Review:
ఈ గ్లింప్స్ విషయానికి వస్తే.. ఇది 1:59 సెకన్లు నిడివి కలిగి ఉంది. ‘ఒక చిన్న ప్రేమ కథ చెబుతా. 2025 టెక్నాలజీ ఇంకా పూర్తిగా డెవలప్ అవ్వని రోజు. అడవిలోకి వెళ్తే కనీసం ఫోన్ సిగ్నల్స్ కూడా వచ్చేవి కావు. అలాంటి టైంలో ఒకడు 30 మందిని తిండి నిద్ర లేకుండా పరిగెత్తించాడు. గ్యాంగ్స్టరో, స్మగ్లరో కాదు. 25 ఏళ్ళు కూడా నిండని ఒక ప్రేమికుడు. మన సిటీలో ఎలా బ్రతకాలో మనకు తెలిసిన దాంట్లో 50 శాతం కూడా వాడికి తెలియదు. కానీ అడవిలో ఎలా బ్రతకాలో మనకన్నా 50 రెట్లు ఎక్కువ తెలుసు.
ఎందుకు పరిగెత్తించాడు అనే కదా మీ అనుమానం. మరి తన బంగారు ప్రేమకథలో వేలు పెడితే కుట్టడా? కొట్టడా?’ అంటూ నాని వాయిస్ ఓవర్లో టీజర్ సాగింది. అడవిలో సాగే రోషన్, సాక్షి..ల ప్రేమకథ, రొమాన్స్ ను హైలెట్ చేశారు. బండి సరోజ్ కుమార్ ఇందులో విలన్ గా నటించాడు. హీరో కంటే ఎక్కువగా అతని పాత్రకే ఎలివేషన్ ఇచ్చినట్టు అనిపిస్తుంది. కాల భైరవ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టీజర్ కి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. మీరు కూడా ఓ లుక్కేయండి :