Manisharma: ఘనంగా మణిశర్మ పుట్టినరోజు వేడుకలు..సందడి చేసిన మెహర్ రమేష్, తమన్.. ఫోటోలు వైరల్..!

టాలీవుడ్ లో ఇప్పటికీ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా రాణిస్తున్న మణిశర్మ నిన్న తన 58వ పుట్టినరోజు వేడుకని ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ వేడుకకి దర్శకుడు మెహర్ రమేష్, తమన్ స్పెషల్ గెస్ట్ లుగా విచ్చేసి సందడి చేశారు. తమన్ హడావిడి రెగ్యులర్ గా చూస్తుందే కానీ.. నిన్న మెహర్ చేసిన సందడైతే హాట్ టాపిక్ గా మారింది.మణిశర్మ పుట్టినరోజు వేడుకలో స్టేజి పై ఆయన పాటలు పడుతూ సింగర్స్ హల్ చల్ చేశారు.

ఇక మెహర్ రమేష్ ఎంట్రీ ఇవ్వగానే తన ‘కంత్రి’ సినిమాలో ‘1,2,3 .. నేనొక కంత్రి’ అనే పాటని పాడారు. అంతే మెహర్ రమేష్ డ్యాన్స్ చేసుకుంటూ మణిశర్మ వద్దకు వెళ్ళాడు. ఆ తర్వాత కూడా డాన్స్ చేసి సడన్ గా మణిశర్మకి ముద్దు పెట్టాడు. ఈ వీడియోని పోస్ట్ చేసిన మెహర్.. ‘ఈ పాటని 2007 లో జూలై 11న కంపోజ్ చేసినట్లు తెలిపాడు. యూ ఎస్ ఎ లో ఉన్న చికాగోలో ఈ పాటని కంపోజ్ చేసినట్లు తెలిపాడు.

మణిశర్మతో పాటు తమన్, మహాతి సాగర్ కూడా తన ఫేవరెట్ అని ఈ సందర్భంగా మెహర్ రమేష్ తెలిపాడు. మెహర్ రమేష్ డైరెక్ట్ చేసిన ‘కంత్రి’, ‘బిల్లా’, ‘శక్తి’ వంటి చిత్రాలకు మణిశర్మ సంగీతం అందించాడు. అంతేకాదు అంతకు ముందు కన్నడ లో మెహర్ రమేష్ డైరెక్ట్ చేసిన ‘అజయ్'(‘ఒక్కడు’ రీమేక్) చిత్రానికి కూడా మణిశర్మ సంగీతం అందించాడు.

ఇప్పుడు మెహర్ రమేష్ మెగాస్టార్ చిరంజీవితో చేస్తున్న ‘భోళా శంకర్’ కు మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ విషయాలను పక్కన పెట్టేసి నెట్టింట్లో వైరల్ అవుతున్న మణిశర్మ.. మెహర్ రమేష్ ల ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus