పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి అతని ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అతనికి ఇది ఊరికే వచ్చింది కాదు. అతని వ్యక్తిత్వం, సేవాగుణం, ఆదరించే మనసుకి ప్రతీక ఇది. చిరంజీవి తమ్ముడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా… తనకంటూ ప్రత్యేకతని చాటుకుంటేనే స్టార్ ఇమేజ్ దక్కింది. అది కూడా తన మొదటి 7 సినిమాల్లో 4 సినిమాలు కొత్త దర్శకులతో చేసినవే. అవి బ్లాక్ బస్టర్లు అవ్వడంతో పవన్ కు యూత్ లో మంచి క్రేజ్ ఏర్పడింది.
మాస్ హీరోయిజానికి సరికొత్త డెఫినిషన్ చెప్పింది పవన్ కళ్యాణ్ అనడంలో అతిశయోక్తి లేదు. ఇక అతను అవకాశం ఇచ్చిన ఆ నలుగురు దర్శకుల్లో ఎస్.జె.సూర్య కూడా ఒకడు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘ఖుషి’ మూవీ ఓ క్లాసిక్ గా నిలిచింది. భూమిక, పవన్ కళ్యాణ్ ల మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు ఓ రేంజ్లో పండాయి. మణిశర్మ సంగీతం గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ సినిమాలో ఉన్న అన్ని పాటలు సూపర్ హిట్ అయ్యాయి.
ఇప్పటికీ చాలా మంది ప్రేక్షకులు వాటిని హమ్ చేసుకుంటూనే ఉన్నారు. ఇప్పటికీ ‘ఖుషి’ పాటలు చాలా ఫ్రెష్ గా అనిపిస్తాయి. వాటికి సాహిత్యం కూడా బాగా కుదిరింది. అయితే ‘ఖుషి’ లో ‘యే మేరా జహ’ అనే సాంగ్ ఉంటుంది. ఇది పెద్ద చార్ట్ బస్టర్ అయ్యింది. నిజానికి ఈ పాట మొత్తం హిందీలో ఉంటుంది. అబ్బాస్ అనే లిరిసిస్ట్ ఈ పాటకు లిరిక్స్ అందించడం జరిగింది. అప్పటివరకు టాలీవుడ్లో వచ్చిన ఏకైక హిందీ పాట ఇది.
చాలా మందికి లిరిక్స్ రాకపోయినా, అర్థం కాకపోయినా ఈ పాటని తెగ వినేస్తారు. ఈ సినిమాలో ఈ పాట పవన్ ఐడియా వల్లే పెట్టారట. ఈ విషయాన్ని తాజాగా మణిశర్మ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.పవన్ ఐడియాలజీలో నుండి పుట్టిన ఈ పాట చార్ట్ బస్టర్ అవుతుందని ఎవ్వరూ ఊహించలేదట.