Manju Warrier: అప్పుడు మిస్ అయినా.. ఇప్పుడు మాత్రం మిస్ చేయకండి..!

రజినీకాంత్ (Rajinikanth)  హీరోగా తెరకెక్కుతున్న ‘వేట్టయన్’ (Vettaiyan)  నుండి మనసిలాయో అనే పాట ఇటీవల రిలీజ్ అయ్యింది. అనిరుధ్ (Anirudh Ravichander)  సంగీతంలో రూపొందిన ఈ పాట… సోషల్ మీడియాలో ఓ రేంజ్లో వైరల్ అవుతుంది. ఈ లిరికల్ సాంగ్లో రజనీకాంత్, అనిరుధ్ వంటి వారు ఉన్నా.. వారిని పూర్తిగా డామినేట్ చేసేసింది మంజు వారియర్ (Manju Warrier) . ఈ పాటలో ఆమె వేసిన స్టెప్పులు ‘టాక్ ఆఫ్ ది టౌన్’ అయ్యాయి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో ఈమెదే హవా అంతా…! తమిళంలో, మలయాళంలో మాత్రమే కాదు..

Manju Warrier

తెలుగులో కూడా ఈ పాట ఓ రేంజ్లో వైరల్ అవుతుంది. ఈ పాటకు మంజు డాన్స్ ప్రాక్టీస్ చేసిన వీడియో కూడా వైరల్ అవుతుంది.. అంటే ఏ రేంజ్లో ఈ పాట ట్రెండ్ అవుతుందో అర్థం చేసుకోవచ్చు. అలాగే తెలుగు ప్రేక్షకులు మంజు కోసం సోషల్ మీడియాలో తెగ సెర్చ్ చేస్తున్నారు. ఎందుకంటే మంజు వారియర్… తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియదు. ఈమె ఓ మలయాళ నటి. అక్కడ లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో బాగా పాపులర్ అయ్యింది.

తెలుగు, తమిళంలో నయనతార (Nayanthara), అనుష్క (Anushka) రేంజ్లో అక్కడ స్టార్ అయ్యింది. నటుడు దిలీప్ తో పెళ్లి విడాకుల వ్యవహారం వల్ల.. మొదట్లో ఈమె సినిమాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది.అయితే 2014లో వచ్చిన ‘హౌ ఓల్డ్ ఆర్ యూ’ అనే సినిమాతో ఈమె రీ ఎంట్రీ ఇచ్చింది. అజిత్ తో చేసిన ‘తెగింపు'(తునీవు) తో ఈమె తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. అయితే స్ట్రైట్ తెలుగు సినిమాలో ఈమె నటించింది అంటూ లేదు. ఒక తెలుగు సినిమాలో ఈమెకు ఛాన్స్ వచ్చిందట.

చిరంజీవి (Chiranjeevi) నటించిన ‘గాడ్ ఫాదర్’ (God Father) లో ఈమెను చెల్లెలి పాత్రకి అంటే నయనతార పాత్రకి తీసుకోవాలి అనుకున్నారట. కానీ ఆ టైంకి ఈమె వేరే సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉండటం వల్ల చేయలేదు. ఇప్పుడు ‘మనసిలాయో’ సాంగ్ ద్వారా మంజు (Manju Warrier) వైరల్ అవ్వడం.. టాలీవుడ్ దర్శక నిర్మాతలు… ‘ఇన్నాళ్లు ఈమెను ఎలా మిస్సయ్యాం’ అంటూ ఆలోచనలో పడ్డారట. అందుకే తమ సినిమాల్లో పాత్రల కోసం ఆమెతో సంప్రదింపులు కూడా జరుపుతున్నట్లు సమాచారం.సో త్వరలోనే ఆమెను తెలుగు సినిమాలో చూసే అవకాశం ఉందన్న మాట.

ఆ నగరంలో ఎన్టీఆర్ మాస్ కటౌట్.. తారక్ రేంజ్ నెక్స్ట్ లెవెల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus