నేను రాసిన కథ పవన్ కళ్యాణ్ కి నచ్చుతుంది – మంజుల

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే సామాన్యులకు మాత్రమే కాదు సెలబ్రిటీలకు ఇష్టమే. సూపర్ స్టార్ కృష్ణ కుమార్తె, మహేష్ బాబు సోదరి మంజులకు కూడా పవన్ అంటే చాలా ఇష్టం. ‘మా నాన్నగారు .. మహేశ్ తరువాత నేను ఎక్కువగా అభిమానించే వ్యక్తి పవన్ కల్యాణ్. ఆయనలోని నిజాయతీ నాకు బాగా నచ్చుతుంది.’ అని మంజుల అన్నారు. ఆమె తొలి సారి దర్శకత్వం వహించిన “మనసుకు నచ్చింది” ఈ నెల 16వ తేదీన రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న మంజుల సినిమా విశేషాలతో పాటు పవన్ గురించి చెప్పారు. “పవన్ కళ్యాణ్ కోసం నేను ఒక కథ రాసుకున్నాను .. ఆ కథకి “పవన్” అనే టైటిల్ ను కూడా పెట్టేశాను. నేను రాసిన కథ పవన్ వినాలే గానీ, ఆయనకి తప్పకుండా నచ్చుతుంది” అని వెల్లడించారు.

ఈ విధంగా పవన్ ని డైరక్ట్ చేయాలనే కోరికను బయటపెట్టారు. ప్రస్తుతం పవన్ సినిమాలను వీడి ప్రజల్లోకి వెళ్లారు. ప్రజా సమస్యల పోరాటానికి దిగారు. ఇప్పట్లో సినిమా కథలు వినే తీరిక అతనికి లేదు. అందుకే ఒకసారి ఈ కథ వినమని పవన్ కి మీరైనా చెప్పండని మీడియా మిత్రులను మంజుల కోరారు. ఇక “మనసుకు నచ్చింది” సినిమా విషయానికి వస్తే “సందీప్ కిషన్, అమైరా దస్తూర్ జంటగా ఈ సినిమా యువతని ఆకట్టుకుంటుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus