Manmadhudu: 22 ఏళ్ల తర్వాత ‘మన్మథుడు’ జంట కలయిక.. వైరల్ అవుతున్న పిక్స్!

2002 డిసెంబర్లో వచ్చిన మన్మథుడు సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. కింగ్ నాగార్జున హీరోగా సోనాలి బింద్రే, అన్షు.. లు హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి విజయ్ భాస్కర్.కే దర్శకుడు. ఈ సినిమాలో నాగార్జున నటన ఆయన కామెడీ టైమింగ్ చాలా కొత్తగా ఉంటుంది. అలాగే సునీల్ , బ్రహ్మానందం..ల కామెడీ టైమింగ్ కూడా అదరహో అనే విధంగా ఉంటాయి. బ్రహ్మానందం పలికిన ‘ దే పెయిడ్ నో ‘ , సునీల్ పలికిన ‘ నేను బంకు.. పెళ్లి కూతురు జంపు ‘ వంటి డైలాగులు ఎప్పటికీ ప్రేక్షకులు మరిచిపోలేరు అనడంలో అతిశయోక్తి లేదు.

ఇక నాగార్జున రొమాంటిక్ యాంగిల్.. అప్పట్లో యూత్ ను అమితంగా ఆకట్టుకుంది. ఇదిలా ఉండగా.. ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా నటించిన అన్షు.. ఇటీవల హైదరాబాద్ కి రావడం జరిగింది. ఈ క్రమంలో పలు మీడియా సంస్థలకి ఆమె ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఇందులో భాగంగా.. ‘మన్మథుడు’ షూటింగ్ అనుభవాలు కూడా గుర్తుచేసుకుంది. ‘రాఘవేంద్ర’ టైంలో ప్రభాస్ తో మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడిందని.. ‘బాహుబలి’ తో అతను పాన్ ఇండియా స్టార్ అవ్వడం చాలా సంతోషాన్నిచ్చిందని చెప్పుకొచ్చింది.

ఇక ఇప్పుడు రీ ఎంట్రీ ఇవ్వాలనే ఆలోచన కూడా ఉందని అన్షు తెలియజేసింది. పనిలో పనిగా ఈమె ‘మన్మథుడు’ హీరో నాగార్జునని కూడా కలిసింది.ఈ క్రమంలో 22 ఏళ్ళ తర్వాత మహి, అభి..లు కలుసుకున్నారు అంటూ (Manmadhudu) ‘మన్మథుడు’ లోని నాగార్జున, అన్షు..ల పాత్రల పేరుని గుర్తు చేస్తూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

జీవితంలో నేను కోరుకునేది ఇది మాత్రమే.. శోభిత చెప్పిన విషయాలివే!

‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!
ఒకప్పుడు సన్నగా ఉండి ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన 11 హీరోయిన్స్.!

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus