టాలీవుడ్ ఐరన్ లెగ్!!!

సహజంగా మన సినిమా ఇండస్ట్రీలో వరుస హిట్స్ కొట్టిన వాళ్ళను అదృష్టవంతులు అని, వరుస ఫ్లాప్స్ ఇచ్చిన వాళ్ళను ఐరన్ లెగ్ అని పిలుస్తూ ఉంటారు. అయితే అదే క్రమంలో సక్సెస్ఫుల్ కాంబినేషన్స్ అనే పధం సైతం ఒకట్ మనం ఎప్పుడూ వింటూ ఉంటాం. అదేమిటంటే…ఒక హీరో హీరోయిన్ తో సినిమా హిట్ అయినా, ఒక దర్శకుడు, హీరోతో సినిమా హిట్ అయినా దాన్ని సక్సెస్ఫుల్ కాంబినేషన్ గా పిలుస్తూ ఉంటారు.

అయితే అదే క్రమంలో సినిమాకు బాగా కీలకం అయిన హీరోయిన్స్ ను సైతం వారి హిట్స్ హిస్టరీ చూసి ఎంపిక చేసుకుంటారు మన దర్శక నిర్మాతలు, వార్సా హిట్స్ వస్తే ఆమెను గోల్డెన్ లెగ్ అని, ఎక్కువ పారితోషకం ఇచ్చి మరీ తీసుకుంటారు. కానీ కొందరికి మాత్రం అస్సలు అదృష్టం కలసి రాదు…అలాంటి హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు…కానీ తాజాగా ఒక భామా టాలీవుడ్ గడప తొక్కింది ఆమె ఇప్పుడు లేటెస్ట్ ఐరన్ లెగ్ గా మారిపోయింది…ఇంతకీ ఆ భామ ఎవరంటారా…ఎవరో కాదు…బాలీవుడ్ టాప్ హీరోయిన్ ప్రియాంక చోప్రాకు చెల్లెలైన మన్నారా చోప్రా…బాలీవుడ్ లో ‘జిద్’మూవీతో హీరోయినగా లాంచ్ అయ్యీ, హద్దులు లేకుండా గ్లామర్ ఒలకబోసినా మన్నారాకు ఆది పెద్దగా కలసి రాలేదు.

అదే క్రమంలో తెలుగులో బార్బీ హండా గా పేరు మార్చుకొని సింగర్ శ్రీరామ చంద్ర తో‘ప్రేమా గీమా జాన్తానై’ అనే సినిమాలో నటించింది. ఆ సినిమా ఎప్పుడు వచ్చిందో  కూడా చాలా మందికి తెలీదు.. ఇక ఇప్పుడు సునీల్ తో జక్కన్న చేసింది. కానీ ఆ సినిమా కూడా డిజాస్టర్ గా మారిపోయింది. ఇక తాజాగా వరుస హిట్స్ హీరో సాయి ధర్మ తేజతో తిక్క లో కనిపించనుంది. ఆ సినిమా ఏమైనా తేడా కొడితే….ఈ భామను ఐరన్ లెగ్ మా కన్ఫర్మ్ చేసేస్తుంది ఇండస్ట్రీ.

https://www.youtube.com/watch?v=ZGy7nC0HoF8

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus