Samantha: సమంత వర్క్ చూసి భయపడిన నటుడు!

బాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ నటుల్లో మనోజ్ బాజ్‌పేయి ఒకరు. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ ద్వారా ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆయనకు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2లో ఆయనతో కలిసి నటించింది సమంత. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మనోజ్.. సమంత గురించి కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ షూటింగ్ సమయంలో సమంత వర్కింగ్ స్టైల్ గురించి కొన్ని విషయాలు వెల్లడించారు.

ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 స్ట్రీమింగ్ కి రెడీ అవుతుండడంతో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు మనోజ్. ఈ సమయంలో సమంత గురించి మాట్లాడుతూ.. ఆమె కష్టపడే విధానం తనను చాలా భయపెట్టిందని చెప్పారు. షూటింగ్ సమయంలో సమంత చాలా కష్టపడుతుందని.. ఫిజికల్ గా చాలా శ్రమ పడుతుందని అన్నారు. చూసేవాళ్లకే అంత బాధ కలిగితే.. ఆమెకి ఎంత బాధ కలుగుతుందో..? అందుకే ఆమె కాస్త శ్రమ తగ్గించుకోవాలి అంటూ చెప్పుకొచ్చారు.

మనోజ్ ఇచ్చిన ఈ సలహాపై సమంత రియాక్ట్ అయింది. ‘తప్పకుండా ప్రయత్నిస్తాను సార్’ అంటూ బదులిచ్చింది. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ స్పై థ్రిల్లర్ సిరీస్ ను రాజ్ అండ్ డీకే రూపొందించారు. ఇందులో మనోజ్ బాజ్‌పేయి, ప్రియమణి, శరద్ కేల్కర్, నీరజ్ మాధవ్, షరీబ్ హష్మీ, దలీప్ తాహిల్, సన్నీ హిందూజా, శ్రేయా ధన్వంతరి నటించారు. సీజన్ 2లో సమంత రాజీ అనే టెర్రరిస్ట్ పాత్ర పోషించింది.

ఈ పాత్రలో ఆమె పెర్ఫార్మన్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ పాత్రలో నటించడానికి ఆమె స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకుంది. యాక్షన్ సీన్స్ లో అద్భుతంగా నటించింది. దానికోసం సమంత పడిన కష్టం అందరినీ ఆశ్చర్యపరిచేదని మనోజ్ చెప్పుకొచ్చారు. ఫ్యామిలీ మ్యాన్ ఫస్ట్ సీజన్ 2019లో స్ట్రీమింగ్ కాగా.. రెండో సీజన్ 2021లో స్ట్రీమింగ్ అయింది. మూడో సీజన్ రిలీజ్ గురించి మనోజ్ చెబుతూ.. ఈ హొలీకి రిలీజ్ అవుతుందని అన్నారు.

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus