మలయాళంలో నటుడిగా మంచి ఫామ్ లో ఉన్న బాసిల్ జోసఫ్ (Basil Joseph) నటించిన తాజా చిత్రం “మరణమాస్” (Marana Mass). ఏప్రిల్ 10న మలయాళంలో విడుదలైన ఈ చిత్రం మిశ్రమ స్పందనతో సరిపెట్టుకుంది. ఈ చిత్రం ఇప్పుడు సోనీ లైవ్ లో స్ట్రీమ్ అవుతుంది. మరి ఓటీటీ ఆడియన్స్ ను ఈ సినిమా ఏమేరకు ఆకట్టుకోగలుగుతుందో చూద్దాం..!!
కథ: కేరళ రాష్ట్రం మొత్తం అరటిపండు కిల్లర్ చేస్తున్న వరుస హత్యలను చూస్తూ భయపడుతుంటుంది. ఆ కేస్ ను డీల్ చేయడం కోసం మోస్ట్ సిన్సియర్ ఆఫీసర్ అజయ్ రామచంద్రన్ (బాబు ఆంటోని)ని (Babu Antony) రంగంలోకి దించుతుంది.
కట్ చేస్తే.. ల్యూక్ (బాసిల్ జోసెఫ్) ఇంకొన్ని రోజుల్లో ఫారిన్ వెళ్లాల్సి ఉండగా.. తన ప్రియురాలు జెస్సీ (అనిష్మా)(Anishma)ను ఫాలో చేస్తూ ఓ బస్సు ఎక్కుతాడు. ఆ బస్సులోనే పోలీసులు వెతుకుతున్న సీరియల్ కిల్లర్ తోపాటు.. జెస్సీ, బస్సు డ్రైవర్ & కండెక్టర్ మరియు కథలో కీలకమైన వ్యక్తి అయిన కేశవ కురుప్ (పులియనం) కూడా ఉంటాడు.
అసలు వీళ్లందరూ ఒకే బస్సులో ఎందుకు ప్రయాణించాల్సి వస్తుంది? ల్యూక్ ఆ సీరియల్ కిల్లర్ ను పట్టుకోగలిగాడా? అసలు ఆ సీరియల్ కిల్లర్ ముసలివాళ్లనే ఎందుకు చంపుతున్నాడు? వంటి ప్రశ్నలకు సమాధానమే “మరణమాస్” (Marana Mass) చిత్రం.
నటీనటుల పనితీరు: బాసిల్ తనదైన శైలి కామెడీ టైమింగ్ & బాడీ లాంగ్వేజ్ తో అలరించాడు. ముఖ్యంగా ఓపెనింగ్ సీన్ లో విజయ్ “అదిరింది” సీన్ ని రీక్రియేట్ చేయడం బాగుంది. అలాగే.. సెకండాఫ్ లో గాంజా కొట్టి మాట్లాడే సీన్స్ లో అతడి డైలాగ్స్ కడుపుబ్బ నవ్విస్తాయి.
అనిష్మా ఇండిపెండెంట్ యంగ్ లేడీగా అలరించింది. ఇక కీలకమైన కేశవ పాత్రలో నటించిన పులియనం పాత్ర సినిమాకి కేంద్రబిందువుగా నిలిచిన విధానం, అతడి నటన అలరిస్తాయి.
నిజానికి సినిమాలో ఉన్న పాత్రలన్నీ చాలా సీరియస్ గా ఉంటాయి కానీ.. వాటి చుట్టూ అల్లుకున్న సన్నివేశాలు, సందర్భాలు కామెడీగా ఉంటాయి. అందువల్ల ప్రతి పాత్ర ఎక్కడో ఒక చోట నవ్విస్తుంది.
సాంకేతికవర్గం పనితీరు: ఒక సర్కాస్టిట్ కామెడీ ఎంటర్టైనర్ తెరకెక్కించడంలో దర్శకుడు శివప్రసాద్ (Sivaprasad) సక్సెస్ అయ్యాడు. అయితే.. అది వెటకారం అని అర్థమైనప్పుడు, దాని చుట్టూ అల్లుకున్న సమస్య లేదా పాత్రలు ఇంకాస్త సీరియస్ గా ఉండాలి. లేకపోతే ఆ సీరియస్ నెస్ ద్వారా కామెడీ సరిగా వర్కవుట్ అవ్వదు. రాకేష్ మాధవన్ పాత్రను డిజైన్ చేసిన విధానం బాగున్నా.. ఆ పాత్రను సరిగా ఎస్టాబ్లిష్ చేయలేదు. అందువల్ల ఆ పాత్ర సీరియస్ నెస్ చుట్టూ కామెడీ ఉన్నా.. పూర్తిగా ఆస్వాదించలేం. బాసిల్ కాస్త కాపాడే ప్రయత్నం చేశాడు కానీ.. కనెక్టివిటీ ఇష్యూస్ కారణంగా అవేమీ పండలేదు.
మ్యూజిక్, సినిమాటోగ్రఫీ వర్క్, ఆర్ట్ వర్క్ వంటి టెక్నికాలిటీస్ అన్నీ డీసెంట్ గా ఉన్నాయి.
విశ్లేషణ: వ్యంగ్యం, వెటకారం నేపథ్యంలో సినిమాలు కుదిరితే హిలేరియస్ గా నవ్విస్తాయి, లేదంటే ఆసక్తికరంగా సాగుతాయి. ఈ రెండిటికీ మధ్య ఉండిపోయిన సినిమా “మరణమాస్”. బాసిల్ జోసఫ్ నటన, ఎగ్జైటింగ్ బీజియం & థ్రిల్లింగ్ క్యారెక్టర్స్ ఉన్నప్పటికీ.. వాటన్నిటినీ మ్యానేజ్ చేసే సరైన కథనం లేకపోవడంతో థ్రిల్లింగ్ గా ఉండాల్సిన సినిమా యావరేజ్ టైంపాస్ ఎంటర్టైనర్ గా మిగిలిపోయింది!
ఫోకస్ పాయింట్: టైమ్ పాస్ కామెడీ థ్రిల్లర్!
రేటింగ్: 2/5