గతకొద్ది రోజులుగా సినిమా ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి.. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్‌తో పాటు.. కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమల్లో పలువురు మరణించారు.. ఐంద్రీలా శర్మ అనే పాపులర్ బెంగాలీ నటి ఇప్పటికే రెండుసార్లు క్యాన్సర్ మహమ్మారిని జయించారు.. మూడోసారి కూడా క్యాన్సర్ బారినపడి, హాస్పిటల్‌లో వెంటిలేటర్ మీద ప్రాణాలతో పోరాడుతున్నారు.. బాలీవుడ్ డైరెక్టర్ రాకేష్ కుమార్, జిమ్‌లో వర్కౌట్ చేస్తూ నటుడు చనిపోయారనే వార్తలు మర్చిపోకముందే ఇప్పుడు మరో పాపులర్ నటి రోడ్డు ప్రమాదంలో మరణించడంతో పరిశ్రమ వర్గాలవారు షాక్‌కి గురవుతున్నారు..
సీరియళ్ల ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆ నటి బైకుపై ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.. వివరాల్లోకి వెళ్తే.. ప్రముఖ మరాఠీ సీరియల్ యాక్ట్రెస్ కళ్యాణి కురాలే జాదవ్ రోడ్ యాక్సిడెంట్‌లో మరణించారు.. ఆమె వయసు 32 సంవత్సరాలు..‘తుజ్యాత్ జీవ్ రంగాలా’ వంటి పలు సీరియళ్లలో నటించి గుర్తింపు తెచ్చుకోవడమే కాక తనకంటూ ప్రత్యేకంగా అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇటీవలే హలోండిలో సొంతంగా రెస్టారెంట్ స్టార్ చేసిన కళ్యాణి, శనివారం (నవంబర్ 12) రాత్రి రెస్టారెంట్ క్లోజ్ చేసి ఇంటికి బయలు దేరగా ఈ సంఘటన చేటుచేసుకుంది.
సాంగ్లీ – కొల్హాపూర్ హైవేపై హలోండి సమీపంలో వెళ్తున్న క్రమంలో.. వెనుక నుండి వేగంగా వస్తున్న కాంక్రీట్ మిక్సర్ కళ్యాణి బైకును ఢీకొట్టింది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లారు.. కాగా అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయారని డాక్టర్స్ తెలిపారు.. కళ్యాణి మరణంతో మరాఠీ టీవీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది.. సీరియళ్లలో తన నటనతో అలరించిన కళ్యాణి ఇకలేరనే వార్తతో ఫ్యాన్స్ షాక్‌కి గురయ్యారు..
డైహార్డ్ ఫ్యాన్స్ అయితే శోకసంద్రంలో మునిగి పోయారు.. ‘‘ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న తను, జీవితంలో ఇంకా బాగా స్థిరపడాలని ఇటీవలే వ్యాపారం కూడా ప్రారంభించింది.. ఇంత తక్కువ వయసులోనే ఆమె ఈ లోకాన్ని విడిచి వెళ్లడం ఎంతో బాధాకరమం’’టూ కళ్యాణి అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.. ప్రమాదానికి కారణమైన కాంక్రీట్ మిక్సర్ డ్రైవరును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు..