మార్చి నెల అంటే సమ్మర్ సీజన్ మొదలైనట్టే. మరోపక్క టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్ కూడా మొదలవుతాయి. కాబట్టి.. ఈ టైంలో తెలుగులో పెద్ద సినిమాలు రిలీజ్ కావు. ఈసారి కూడా అదే జరిగింది. చిన్న మరియు మిడ్ రేంజ్ సినిమాలే ఈ నెలలో ఎక్కువగా రిలీజ్ అయ్యాయి. దాదాపు 40 సినిమాలు రిలీజ్ అయితే కేవలం 2 ,3 సినిమాలే సక్సెస్ సాధించడం అనేది గమనించదగ్గ విషయం.
మార్చి నెలలో కనుక గమనిస్తే.. ‘మా ఊరి రాజారెడ్డి’ ‘ఆపరేషన్ వాలెంటైన్'(Operation Valentine ‘రాధా మాధవం’ ‘ఎస్ 99’ ‘వ్యూహం’ (Vyooham) ‘బాబు నెంబర్ 1 బుల్షిట్ గాయ్’ ‘గామి'(Gaami) ‘భీమా'(Bhimaa) ‘ప్రేమలు'(డబ్బింగ్) (Premalu) ‘బుల్లెట్’ ‘రికార్డ్ బ్రేక్’ ‘వుయ్ లవ్ బ్యాడ్ బాయ్స్’ ‘రాజు గారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి’ ‘ఫ్యాక్షన్ లేని సీమకథ’ ‘లంబసింగి’ (Lambasingi) ‘మాయ’ ‘రవికుల రఘురామ’ ‘రజాకార్’ (Razakar) ‘షరతులు వర్తిస్తాయి’ (Sharathulu Varthisthai) ‘తంత్ర’ (Tantra) ‘వెయ్ దరువెయ్’ ‘అనన్య’ ‘హద్దు లేదురా’ ‘లైన్ మెన్’ ‘ఓం భీం బుష్’ (Om Bheem Bush) ‘వందే భారత్’ ‘సేవ్ ఇండియా’ ‘యమధీర’ ‘టిల్లు స్క్వేర్’ (Tillu Square) వంటి వాటితో సహా ఇంకా కొన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి.
అయితే ఇందులో ‘టిల్లు స్క్వేర్’ బ్లాక్ బస్టర్ గా ‘ప్రేమలు’ సూపర్ హిట్ గా నిలిచింది. ‘గామి’ ‘ఓం భీమ్ బుష్’ వంటివి డీసెంట్ హిట్స్ గా నిలిచాయి. ఇక ‘భీమా’ చిత్రం యావరేజ్ ఫలితంతో సరిపెట్టుకుంది. అలాగే ‘భూతద్దం భాస్కర్ నారాయణ’ (Bhoothaddam Bhaskar Narayana) ‘లంబసింగి’ సినిమాలకి హిట్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటలేకపోయాయి.