తమిళ స్టార్ హీరో విశాల్ సినిమాలకి తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంటుంది. అందుకే తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఏక కాలంలో రిలీజ్ అవుతాయి అతని సినిమాలు..! ‘మార్క్ ఆంటోని’ కూడా సెప్టెంబర్ 15 న రిలీజ్ అయ్యింది. సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ టైం ట్రావెల్ కాన్సెప్ట్‌తో దర్శకుడు అధిక్ రవిచంద్రన్ తెరకెక్కించిన ఈ మూవీని ఎస్ వినోద్ కుమార్ నిర్మించారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందించారు.
ఎస్ జే సూర్య, సునీల్ ముఖ్య పాత్రలు పోషించారు. రీతూ వర్మ హీరోయిన్‌గా నటించింది. మార్క్ ఆంటోని ప్రమోషన్లలో భాగంగా విడుదల చేసిన కంటెంట్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. దీంతో తెలుగులో కూడా ఈ సినిమా పై ఆసక్తి పెరిగింది.కానీ మొదటి రోజు ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ హాలిడేస్ కలిసి రావడంతో మూవీ బాగానే కలెక్ట్ చేసి బ్రేక్ ఈవెన్ సాధించింది. ఒకసారి 8 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :
నైజాం
1.07 cr
సీడెడ్
0.43 cr
ఉత్తరాంధ్ర
0.51 cr
ఈస్ట్
0.27 cr
వెస్ట్
0.24 cr
గుంటూరు
0.42 cr
కృష్ణా
0.49 cr
నెల్లూరు
0.21 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
3.64 cr
‘మార్క్ ఆంటోనీ’ (Mark Antony) చిత్రానికి తెలుగులో రూ.3 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.3.25 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది.
8 రోజుల్లో ఈ చిత్రం రూ.3.64 కోట్ల షేర్ ను రాబట్టి బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా రూ.0.39 కోట్ల లాభాలను అందించింది. ఈ వారం కూడా చెప్పుకోదగ్గ సినిమాలు లేవు కాబట్టి ఈ మూవీ ఇంకా కలెక్ట్ చేసే అవకాశం ఉంది