Arjun Sarja: స్టార్‌ యాక్టర్‌ అర్జున్‌ ఇంట్లో పెళ్లి బాజాలు.. వైరల్‌ ఫొటోలు చూశారా?

ప్రముఖ నటుడు అర్జున్‌ (Arjun Sarja) ఇంట పెళ్లి సందడి షురూ అయింది. అర్జున్‌ కుమార్తె, యువ కథానాయిక ఐశ్వర్య (Aishwarya) వివాహం ఈ నెల 14న జరగనుంది. దీనికి సంబంధించిన కార్యక్రమాలు ఇటీవల మొదలయ్యాయి. సీనియర్‌ నటుడు తంబి రామయ్య (Thambi Ramaiah) తనయుడు ఉమాపతి రామయ్యతో ఐశ్వర్యకు ఇటీవల నిశ్చితార్థం జరిఇంది. ఈ క్రమంలో ఇప్పుడు పెళ్లి పనులు మొదలుపెట్టారు. చెన్నైలోని అర్జున్‌ నివాసంలో హల్దీ, మెహందీ, సంగీత్‌ వేడుకలు నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి..

సంగీత్‌ వేడుకకు హీరో విశాల్‌ హాజరయ్యాడు. వేడుక వద్ద అక్కడ ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్ చేయగా.. అభిమానులు వాటిని తెగ షేర్‌ చేస్తున్నారు. ఆ ఫొటోలను షేర్‌ చేస్తూ అర్జున్‌ ఫ్యామిలీ తనకున్న అనుబంధాన్ని విశాల్‌ గుర్తుచేసుకున్నాడు. ‘కవర్‌ మీ ఇన్‌ సన్‌ షైన్‌’ పేరుతో అర్జున్‌ ఇంట్లో జరిగిన ఈ వేడుక సంబంధించిన ఫొటోలు కూడా వైరల్‌ అవుతున్నాయి. ఆ ఫొటోల్లో పసుపు రంగు అనామిక ఖన్నా దుస్తుల్లో ఐశ్వర్య మెరిసిపోయింది.

మరోవైపు ఉమాపతి నలుపు రంగు కుర్తా, దానిపై బంగారు రంగు ఎంబ్రాయిడరీతో మ్యాన్లీగా ఉన్నాడు. అర్జున్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఓ రియాల్టీ షోలో ఉమాపతి పాల్గొన్నాడు. అప్పటి నుండి అర్జున్‌ సర్జా- తంబి రామయ్య కుటుంబాల మధ్య పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే ఉమాపతి, ఐశ్వర్య ప్రేమలో పడ్డారట. ఇక ఐశ్వర్య తమిళం, కన్నడ చిత్రాల్లో నటించింది.

ఆమె హీరోయిన్‌గా, విశ్వక్‌సేన్‌ హీరోగా తెలుగులో అర్జున్‌ దర్శకత్వంలోనే ఓ సినిమా మొదలుపెట్టారు. అయితే వివిధ కారణాల వల్ల సినిమా తాత్కాలికంగా నిలిచిపోయింది. ఇక ఐశ్వర్య ఆఖరిగా 2018లో ఆఖరిగా సినిమాల్లో నటించింది. ఇక ఉమాపతి రామయ్య 2021లో ఆఖరి సినిమాలో నటించారు. ఆ ఏడాదే ‘సర్వైవర్‌ తమిళ్‌’ అనే టీవీ షోలో పాల్గొన్నాడు. ఆ షోకు అర్జున్‌ హోస్ట్‌. అక్కడే ఇరు కుటుంబాలకు పరిచయం ఏర్పడింది.

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus