ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో సునీల్, సలోని హీరో,హీరోయిన్లుగా.. ‘ఆర్కా మీడియా వర్క్స్’ బ్యానర్ పై శోభు యార్లగడ్డ,ప్రసాద్ దేవినేని సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘మర్యాదరామన్న’. 2010 వ సంవత్సరం జూలై 23న విడుదలైన ఈ చిత్రం ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి ఎస్.ఎస్.కాంచి(‘అమృతం’ సీరియల్ ఫేమ్) కథ అందించారు. సునీల్ హీరోగా వచ్చిన రెండవ సినిమా ఇది. అంతకు ముందు అతను ‘అందాల రాముడు’ అనే చిత్రంలో నటించి హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఈరోజుతో ఈ చిత్రం విడుదలై 11 ఏళ్ళు పూర్తి కావస్తోంది.
మరి ఫుల్ రన్లో ఈ చిత్రం ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :
నైజాం | 9.35 cr |
సీడెడ్ | 3.15 cr |
ఉత్తరాంధ్ర | 3.95 cr |
ఈస్ట్ | 2.36 cr |
వెస్ట్ | 1.68 cr |
గుంటూరు | 2.10 cr |
కృష్ణా | 2.02 cr |
నెల్లూరు | 0.98 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 25.59 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 3.52 Cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 29.11 cr |
‘మర్యాదరామన్న’ చిత్రానికి రూ.14.72 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రూ.29.11 కోట్ల షేర్ ను రాబట్టి.. బ్లాక్ బస్టర్ గా నిలిచింది.ఈ చిత్రం కొనుగోలు చేసిన బయ్యర్లకు రూ.14.39 కోట్ల లాభాలు దక్కడం విశేషం.
Most Recommended Video
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!