Vishwak Sen: సాఫ్ట్‌ రోజుల అయిపోయాయ్‌… ఇక మాస్‌గా గోదావరి… ఎవరంటే?

గోదావరి అంటే ఎటకారం, మమకారం అనుకుంటూ ఉంటారు. నిజానికి వాళ్ల మాటలు అలానే ఉంటాయి. అయితే అన్నిసార్లు అలానే ఉంటాయి అనుకోకూడదు. సినిమాల్లో అయితే గోదావరి నేపథ్యం అనగానే సాఫ్ట్‌గా చూపించడం చాలా రోజుల నుండి జరుగుతోంది. కొన్ని సందర్భాల్లో మాస్‌ సినిమాలు, మాస్‌ పాత్రలు పడినా వాటి టైటిల్స్‌లో గోదావరి అని ఉండదు. అయితే తొలిసారి గోదావరి పేరు మీద మాస్‌ టైటిల్‌ ఒకటి పడింది. దీంతో ఇప్పుడు ఆ టైటిల్‌ టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారింది.

మాస్‌ కా దాస్‌ విశ్వక్‌సేన్‌ గోదావరి నేపథ్యంలో ఓ సినిమా చేస్తున్నాడని గత కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి. అధికారికంగా ఎక్కడా సినిమా పేరు, నేపథ్యం చెప్పలేదు. తాజాగా ఈ సినిమా పేరును అనౌన్స్‌ చేశారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో పీరియాడిక్ కథతో సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు ‘గాంగ్స్ ఆఫ్ గోదావరి’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. దీంతో కొత్తగా ఉంది టైటిల్‌ అంటూ సోషల్‌ మీడియాలో చర్చ సాగుతోంది. ఇప్పటివరకు గోదావరి నేపథ్యంలో నిర్మలమైన టైటిల్స్‌ చూశాం కానీ.. ఈసారి మాస్‌ టైటిల్‌ చూశాం అంటున్నారు.

ఇక ఈ సినిమాకు సంబంధించిన ఇటీవల రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో వరుస షెడ్యూల్స్‌లో చిత్రీకరణ జరిగింది. ఈ సందర్భంగా విశ్వక్‌సేన్‌ మాట్లాడుతూ ఇక్కడి వాతావరణం, ఆ పాత్ర తనకు బాగా నచ్చాయని కూడా చెప్పాడు. సితార సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాను కృష్ణ చైతన్య దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. నేహా శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా.. కీలక పాత్రలో అంజలి కనిపించనుంది. యువన్ శంకర్ రాజా ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

ఇక ‘ఫలక్‌నుమా దాస్‌’ సీక్వెల్‌ ‘దాస్ కా దమ్కీ’ తరువాత విశ్వక్‌ సేన్‌ (Vishwak Sen) మూడు సినిమాలు చేస్తున్నాడు. రామ్ తాళ్లూరి, సాహు గారపాటి నిర్మాణంలో రెండు సినిమాలు సెట్స్‌ మీద ఉన్నాయి. ఇది కాకుండా మూడో ‘దాస్‌’ను కూడా తీసుకొస్తానని ఇటీవల విశ్వక్‌ చెప్పాడు. అయితే దాని గురించి ఇంకా వివరాలేమీ లేవు.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus