Mass Mogudu Song Review: బాలయ్య ఫ్యాన్స్, మాస్ ఆడియన్స్‌ని ఆకట్టుకునే ‘వీరసింహా రెడ్డి’ ‘మాస్ మొగుడు’ సాంగ్..

నటసింహ నందమూరి బాలకృష్ణ మరో రెండు రోజుల్లో ‘వీరసింహా రెడ్డి’ గా ప్రేక్షకాభిమానుల ముందుకు రానున్నారు.. యంగ్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించిన ఈ చిత్రంలో శృతి హాసన్ తొలిసారి బాలయ్యతో జత కడుతుంది.. లాల్, ‘దునియా’ విజయ్, వరలక్ష్మీ శరత్ కుమార్, హనీ రోజ్, అజయ్ ఘోష్ కీలక పాత్రల్లో నటించారు.. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ సినిమా మీద అంచనాలు పెంచేసింది..

బాలయ్య ద్విపాత్రాభినయం.. పవర్ ఫుల్ డైలాగ్స్, అదిరిపోయే స్టెప్పులు, ఫ్యాక్షన్ నేపథ్యంలో ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పించేలా యాక్షన్ సీన్లు కనిపించడంతో మూవీ గ్యారెంటీ హిట్ అని ఫిక్స్ అయిపోయారు నందమూరి అభిమానులు.. సంక్రాంతి సెంటిమెంట్ కూడా తోడవడంతో వారి ఆనందం రెట్టింపు అయింది.. ఇక ఓవర్సీస్ ప్రీమియర్స్ బుకింగ్స్ విషయంలో సంక్రాంతి సీజన్‌లో రాబోతున్న మిగతా చిత్రాలకంటే బాలయ్య కాస్త ముందే ఉన్నాడు.. అక్కడ రికార్డ్స్ స్థాయిలో టికెట్స్ బుక్ అవుతున్నాయి..

ఇక మూవీ టీం పెద్దగా ప్రమోషన్స్ ఏవీ చెయ్యనప్పటికీ మంచి బజ్ క్రియేట్ అయింది.. సోమవారం ఈ సినిమా నుండి చిట్ట చివరి అప్‌డేట్ ఇచ్చింది టీం.. ‘వీరసింహా రెడ్డి’ ఆల్బమ్‌లోని లాస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు.. ‘జై బాలయ్య’, ‘సుగుణా సుందరీ’, ‘మా బావ మనోభావాల్ దెబ్బతిన్నాయో’ పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.. ఇక నాలుగో పాట ‘మాస్ మొగుడు’ ప్రేక్షకుల ముందుకొచ్చింది.. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ ట్యూన్ కంపోజ్ చేయగా..

‘సరస్వతీ పుత్ర’ రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ రాశారు..మనో, రమ్య బెహ్రా చక్కగా పాడారు.. ఫ్యాన్స్ అండ్ మాస్ ఆడియన్స్‌ని ఆకట్టుకునేలా ఉంది.. ముఖ్యంగా ‘పుట్టుకతోనే మనలో ఉన్నయ్ నాన్నగారి జీన్సో జీన్స్.. సేమ్ టు సేమ్ ఆ కట్టౌటే మనకి రిఫరెన్సూ’ వంటి పదాలు బాలయ్య అభిమానులను అలరించేలా ఉన్నాయి.. జనవరి 12న ‘వీరసింహా రెడ్డి’ గా బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్నారు నటసింహం..

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus