సంక్రాంతికి వస్తున్న సినిమాల్లో తమిళ తలైవా విజయ్ దళపతి సినిమా ‘మాస్టర్’ ఒకటి. తెలుగులో విజిల్ సినిమాతో లాస్ట్ ఇయర్ మంచి పాజిటివ్ టాక్ ని అందుకున్నాడు విజయ్. ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలుగులో కూడా విజయ్ కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటం వల్ల ఓపెనింగ్ కలక్షన్స్ బాగా వస్తాయి. తెలుగు విషయం పక్కనబెడితే, మనోడికి తమిళంలో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. తమిళంలో ఓపెనింగ్ కలక్షన్స్ పిచ్చెక్కిస్తాడు. మాస్ లో ఫుల్ ఫాలోయింగ్ ఉండటం వల్ల ఒక్కరోజులోనే 50కోట్లకి పైగా కలక్షన్స్ ని కుమ్మేస్తాడు కూడా.
అందుకే, విజయ్ థియేటర్స్ కి సంక్రాంతి టైమ్ లో 100శాతం ఆక్యూపెన్సీ ఇమ్మని తమిళ గవర్నమెంట్ కి రిక్వస్ట్ పెట్టుకున్నాడు. దీనివల్ల వ్యతిరేకత వస్తున్నా సరే, ప్రొడ్యూసర్ కోసం చేయక తప్పడం లేదు. ఎందుకంటే, హిట్ టాక్ వస్తే సినిమాకి క్రౌండ్ 50శాతం మంది వచ్చినా ఎక్కువరోజులు ఆడుతుంది కాబట్టి పర్లేదు. కానీ ఫ్లాప్ టాక్ వస్తే మాత్రం వచ్చే కలక్షన్స్ కూడా రావు. ఇప్పుడు ఇదే భయం మాస్టర్ మూవీ టీమ్ ని కలవరపెడుతోంది. ఇక రీసంట్ గా సెన్సార్ టాక్ ని పూర్తి చేసుకుంది ఈ సినిమా. U/A సర్టిఫికేట్ ని పొందింది. సెన్సార్ టాక్ ప్రకారం సినిమా సూపర్ హిట్ అనే అంటున్నారు.
లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా పై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. కాబట్టి, ఈ సినిమాకి ఓపెనింగ్స్ చాలా బాగుంటాయని అందుకే విజయ్ ఇప్పుడు 100శాతం థియేటర్ ఆక్యూపెన్సీ అడుగుతున్నాడని చెప్తున్నారు సినీ విశ్లేషకులు. మరి సినిమా సగం మంది మాత్రమే థియేటర్స్ ఆక్యూపై చేస్తే అంత కలక్షన్స్ వస్తాయా..? రావా అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఓటీటీలో రిలీజ్ చేయకుండా సినిమాని ఇప్పటివరకూ సంక్రాంతి మార్కెట్ కోసమే ఆపారు. 2021 జనవరి 7వ తేది నుంచి ఆన్ లైన్ బుకింగ్స్ ఓపెన్ చేస్తారని టాక్. అదీ మేటర్.
Most Recommended Video
2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!