టాలీవుడ్ లో సంక్రాంతి ఫైట్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సినిమాల ఓపెనింగ్స్ అయితే గతంలో మాదిరిగా భారీ రేంజ్ లో అయితే ఉండవు. థియేటర్స్ 50% ఆక్యుపెన్సీతో కలెక్షన్స్ ఎంతవరకు లాగుతారు అనేది బిగ్ మిస్టరీగా మారింది. మొదటి రోజు రిలీజ్ ఇబ్బందుల వల్ల క్రాక్ కాస్త తడబడినప్పటికి మరుసటి రోజు నుంచి సత్తా చాటవచ్చనే కామెంట్స్ వస్తున్నాయి. క్రాక్ రిజల్ట్ పై చిత్ర యూనిట్ చాలా కాన్ఫిడెంట్ గా ఉంది.
ఇక రెడ్ సినిమా జనవరి 14న వస్తుండగా అల్లుడు అదుర్స్ ముందుగానే రావాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. అంతా బాగానే ఉంది కానీ సంక్రాంతికి తెలుగు సినిమాలకు మాస్టర్ దెబ్బ పడేలా ఉందని అనుమానాలు వస్తున్నాయి. విజయ్ మాస్టర్ సినిమా జనవరి 13న రాబోతోంది. అంచనాలు అయితే గట్టిగానే ఉన్నాయి. విజయ్ గత సినిమాలు తెలుగులో చాలా వరకు మంచి ఓపెనింగ్స్ ను అందుకున్నాయి. చూస్తుంటే ఈ సారి కూడా సంక్రాంతి హాలిడేస్ లో గట్టిగానే లాగేలా ఉన్నాడు.
బజ్ చూస్తుంటేనే ఈజీగా అర్ధమవుతోంది. ఏ మాత్రం హిట్ టాక్ వచ్చినా కూడా మన సినిమాల కలెక్షన్స్ పై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకే తెలుగు సినిమాలకు పాజిటివ్ టాక్ అని కాకుండా అంతకు మించి అనేలా ఉండాలి. మరి మాస్టర్ ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుందో చూడాలి.