Mathu Vadalara 2 Collections: ‘మత్తు వదలరా 2’ రెండవ రోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

2019 చివర్లో వచ్చిన ‘మత్తు వదలరా’ (Mathu Vadalara) చిత్రం మంచి సక్సెస్ అందుకుంది. ఆ సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సింహా కోడూరి (Sri Simha) . అయితే ఆ తర్వాత.. ‘మత్తు వదలరా’ రేంజ్ సక్సెస్ అయితే అతను అందుకోలేదు. రితేష్ రానా (Ritesh Rana) డైరెక్ట్ చేసిన ఆ చిత్రంలో సత్య (Satya) కామెడీ హైలెట్ గా నిలిచింది. ఇక దాదాపు 5 ఏళ్ళ తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్ గా ‘మత్తు వదలరా 2’ (Mathu Vadalara 2)  రూపొందింది.

Mathu Vadalara 2 Collections

సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి షోతోనే హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. దీంతో ఓపెనింగ్స్ చాలా బాగా వస్తున్నాయి. ఒకసారి (Mathu Vadalara 2 Collections) 2 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 1.32 cr
సీడెడ్ 0.39 cr
ఆంధ్ర(టోటల్) 0.85 cr
ఏపీ + తెలంగాణ(టోటల్) 2.56 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.35 cr
 ఓవర్సీస్ 1.90 cr
వరల్డ్ వైడ్(టోటల్) 4.81 cr

‘మత్తు వదలరా 2’ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.4 కోట్లు. 2 రోజులకే ఈ సినిమా రూ.4.81 కోట్లు షేర్ ని కలెక్ట్ చేసి బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా…. రూ.0.81 కోట్ల లాభాలు అందించింది. మొదటి రోజు కంటే రెండో రోజు ఫుట్-ఫాల్స్ పెరిగాయి. ముఖ్యంగా ఆంధ్రాలో ఈ సినిమా బాగా పికప్ అయ్యింది. ఆదివారం రోజు ‘మత్తు వదలరా 2’ మరింత ఎక్కువగా కలెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి.

ఘనంగా మేఘా ఆకాష్ పెళ్లి.. వైరల్ అవుతున్న ఫోటోలు.!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus