Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » మత్తు వదలరా ట్రైలర్ విడుదల.. డిసెంబర్ 25న సినిమా విడుదల!

మత్తు వదలరా ట్రైలర్ విడుదల.. డిసెంబర్ 25న సినిమా విడుదల!

  • December 18, 2019 / 06:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మత్తు వదలరా ట్రైలర్ విడుదల.. డిసెంబర్ 25న సినిమా విడుదల!

సంగీత దిగ్గజం కీరవాణి తనయుడు శ్రీసింహా కథానాయకుడిగా అరంగేట్రం చేస్తున్న చిత్రం మత్తు వదలరా. రితేష్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చిరంజీవి (చెర్రీ), హేమలత నిర్మాతలు. ఈ సినిమాతో కీరవాణి పెద్ద కుమారుడు కాలభైరవ సంగీత దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ నెల 25న చిత్రం విడుదలకానుంది.

Mathu Vadalara Movie Theatrical Trailer launch3

ఈ చిత్ర ట్రైలర్‌ను బుధవారం ట్విట్టర్ ద్వారా హీరో రానా విడుదలచేశారు. ఈ సందర్భంగా చిత్రబృందం పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటుచేసింది. చిత్ర సమర్పకుడు, మైత్రీ మూవీ మేకర్స్ అధినేతల్లో ఒకరైన నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ మూడేళ్ల క్రితం ఈ కథ విన్నాను. చాలా నచ్చింది. తపన కలిగిన యువప్రతిభావంతులంతా టీమ్‌గా ఏర్పడి అద్భుతంగా సినిమాను రూపొందించారు. విజువల్ ఎఫెక్ట్స్, కెమెరావర్క్‌తో పాటు ప్రతి డిపార్ట్‌మెంట్ వారే స్వంతంగా సమకూర్చుకుంటూ సినిమా చేస్తామని చెప్పగానే అశ్చర్యపోయాను. ఇలా కూడా సినిమా రూపొందించవచ్చా అనిపించింది. రితేష్‌రానా చెప్పిన కథ నాలో ఆసక్తిని రేకెత్తించింది. సినిమాను చేయనని చెప్పడానికి ఛాన్స్ లేకుండాఅద్భుతంగా ఉంది. యమదొంగ, ఒక్కడున్నాడు లాంటి పెద్ద సినిమాలు చేసిన చెర్రీ సుదీర్ఘ విరామం తర్వాత నిర్మించిన చిత్రమిది. ఈ సినిమాకు మేము సమర్పకులుగా వ్యవహరించడం ఆనందంగా ఉంది. పెద్ద హిట్ కంటెంట్‌ను చిన్న బడ్జెట్‌లో చేయడం ఉత్సుకతగా ఉంది. శ్రీసింహా, కాలభైరవ, రితేష్‌రానా, థామస్, తేజ అందరూ కొత్తవాళ్లు కలిసి అద్భుతాన్ని సృష్టించారని ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తారనే నమ్మకం ముంది. ఇప్పటివరకు సినిమా చూసిన వారంతా సినిమా బాగుందని మెచ్చుకున్నారు. మేము ఎలాంటి అనుభూతికి లోనయ్యామో థియేటర్‌లో సినిమా చూస్తున్న ప్రేక్షకుడికి అదే ఫీల్‌ను కలిగించినప్పుడే నిజమైన సక్సెస్ లభిస్తుంది. ప్రేక్షకుల అంతిమతీర్పు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. హిట్ సినిమాతో ఈ ఏడాదిని ముగించబోతున్నామనే నమ్మకం ఉంది అని తెలిపారు.

Mathu Vadalara Movie Theatrical Trailer launch2

నటుడు నరేష్ అగస్త్య మాట్లాడుతూ నటుడిగా నా తొలి సినిమా ఇది. ఈ సినిమా ద్వారా మైత్రీ మూవీస్, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు నాతో పాటు చాలా మంది కొత్తవాళ్లను ప్రోత్సహించడం ఆనందంగా ఉంది. శ్రీసింహా తొలి సినిమాలా కాకుండా అనుభవజ్ఞుడిలా నటించారు. కాలభైరవ మంచి సంగీతాన్ని అందించాడు. ఈ సినిమాతో ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తున్నాం అని అన్నారు.

Mathu Vadalara Movie Theatrical Trailer launch1

సంగీత దర్శకుడు కాలభైరవ మాట్లాడుతూ సంగీత దర్శకుడిగా నా మొదటి సినిమా ఇది. తొలి సినిమా ఎవరికైనా ప్రత్యేకంగా ఉంటుంది. కానీ ఇది నాకు డబుల్ స్పెషల్. ఈ సినిమాతో నేను సంగీత దర్శకుడిగా, నా తమ్ముడు హీరోగా అరంగేట్రం చేస్తున్నాం.పూర్తిస్థాయి థ్రిల్లర్ సినిమా ఇది. నవ్విస్తూనే ఉత్కంఠను పంచుతుంది. సినిమా చేస్తున్నప్పుడు, చూసినప్పుడు చివరిక్షణం వరకు మేము ఎంజాయ్ చేశాం. మేము ఎంతగా ఆనందించామో ప్రేక్షకులు అలాగే ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాం. తొలి సినిమాతోనే మంచి కాన్సెప్ట్, ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులతో పనిచేసే అవకాశం వచ్చిన నిర్మాత చెర్రీకి, మైత్రీ మూవీస్‌కు కృతజ్ఞతలు. ఇటీవల విడుదలైన టీజర్, పాటకు చక్కటి స్పందన లభిస్తున్నది. ట్రైలర్‌తో పాటు సినిమా ప్రతి ఒక్కరిని మెప్పిస్తుందనే నమ్మకం ఉంది.

Mathu Vadalara Movie Theatrical Trailer launch2

దర్శకుడు రితేష్‌రానా మాట్లాడుతూ మూడేళ్ల క్రితం రవిశంకర్, చెర్రీ ఈ కథ వినిపించాం. నాయకానాయికలు, ప్రేమకథ, పాటలు లేకుండా కేవల పాత్రలు, వాటి చుట్టూ అల్లుకున్న సన్నివేశాలు మాత్రమే కనిపిస్తాయి. యథార్థ సంఘటనల్ని ఆధారంగా చేసుకొని రూపొందించాం. వినోదం, థ్రిల్లర్ సమ్మిళితంగా మేము చేసిన సరికొత్త ప్రయత్నమిది అని అని తెలిపారు.

Mathu Vadalara Movie Theatrical Trailer launch3

హీరో శ్రీసింహా మాట్లాడుతూ కథానాయకుడు, దర్శకుడు,నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ కొత్తవాళ్లను నమ్మి సినిమా చేయడం అంటే సాహసమనే చెప్పాలి. మమ్మల్ని నమ్మి అవకాశం ఇచ్చిన నిర్మాత చెర్రీతో పాటు మైత్రీ మూవీస్ వారికి కృతజ్ఞతలు. థ్రిల్లర్ ప్రధానంగా సాగే చిత్రమిది. హీరో రానా ట్రైలర్‌ను విడుదల చేయడం ఆనందంగా ఉంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఛాయాగ్రాహకుడు సురేష్‌సారంగం, విజువల్ ఎఫెక్ట్స్ రవితేజ తదితరులు పాల్గొన్నారు.

వెంకీ మామ సినిమా రివ్యూ & రేటింగ్!
అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Clap Entertainment
  • #Kaala Bhairava
  • #Mathu Vadalara
  • #Mythri Movie Makers
  • #Ritesh Rana

Also Read

HariHara Veeramallu Collections: 3వ రోజు కొంచెం బెటరే..కానీ!

HariHara Veeramallu Collections: 3వ రోజు కొంచెం బెటరే..కానీ!

Kingdom Trailer: రాక్షసులందరికీ రాజై కూర్చున్న విజయ్ దేవరకొండ

Kingdom Trailer: రాక్షసులందరికీ రాజై కూర్చున్న విజయ్ దేవరకొండ

HariHara Veeramallu Collections: 2వ రోజు భారీగా పడిపోయిన వీరమల్లు కలెక్షన్స్..!

HariHara Veeramallu Collections: 2వ రోజు భారీగా పడిపోయిన వీరమల్లు కలెక్షన్స్..!

Sarzameen Movie Review in Telugu: సర్జమీన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Sarzameen Movie Review in Telugu: సర్జమీన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Thalaivan Thalaivii Review in Telugu: తలైవన్ తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Thalaivan Thalaivii Review in Telugu: తలైవన్ తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

HariHara Veeramallu Collections: మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘వీరమల్లు’

HariHara Veeramallu Collections: మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘వీరమల్లు’

related news

Krish: ‘హరి హర వీరమల్లు’ నుండి క్రిష్‌ ఎందుకు బయటకొచ్చారు? ఇదిగో క్లారిటీ!

Krish: ‘హరి హర వీరమల్లు’ నుండి క్రిష్‌ ఎందుకు బయటకొచ్చారు? ఇదిగో క్లారిటీ!

NTR: ఎన్టీఆర్ గా సాయి కుమార్..? సాయి కుమార్ లుక్లో ఇది గమనించారా?

NTR: ఎన్టీఆర్ గా సాయి కుమార్..? సాయి కుమార్ లుక్లో ఇది గమనించారా?

HariHara Veeramallu Collections: 3వ రోజు కొంచెం బెటరే..కానీ!

HariHara Veeramallu Collections: 3వ రోజు కొంచెం బెటరే..కానీ!

Vijay Deverakonda: కొత్త కుంపటి రాజేసిన విజయ్‌ దేవరకొండ.. ఫ్యాన్ వార్స్‌కి కారణమవుతుందా?

Vijay Deverakonda: కొత్త కుంపటి రాజేసిన విజయ్‌ దేవరకొండ.. ఫ్యాన్ వార్స్‌కి కారణమవుతుందా?

Boyapati Srinu: నాగ చైతన్య – బోయపాటి కాంబో ఫిక్స్ అయ్యిందా..?

Boyapati Srinu: నాగ చైతన్య – బోయపాటి కాంబో ఫిక్స్ అయ్యిందా..?

‘చైనా పీస్’ టీజర్ చాలా నచ్చింది. సినిమా తప్పకుండా మంచి విజయాన్ని సాధిస్తుంది: టీజర్ లాంచ్ ఈవెంట్ లో పీపుల్ స్టార్ సందీప్ కిషన్

‘చైనా పీస్’ టీజర్ చాలా నచ్చింది. సినిమా తప్పకుండా మంచి విజయాన్ని సాధిస్తుంది: టీజర్ లాంచ్ ఈవెంట్ లో పీపుల్ స్టార్ సందీప్ కిషన్

trending news

HariHara Veeramallu Collections: 3వ రోజు కొంచెం బెటరే..కానీ!

HariHara Veeramallu Collections: 3వ రోజు కొంచెం బెటరే..కానీ!

18 hours ago
Kingdom Trailer: రాక్షసులందరికీ రాజై కూర్చున్న విజయ్ దేవరకొండ

Kingdom Trailer: రాక్షసులందరికీ రాజై కూర్చున్న విజయ్ దేవరకొండ

2 days ago
HariHara Veeramallu Collections: 2వ రోజు భారీగా పడిపోయిన వీరమల్లు కలెక్షన్స్..!

HariHara Veeramallu Collections: 2వ రోజు భారీగా పడిపోయిన వీరమల్లు కలెక్షన్స్..!

2 days ago
Sarzameen Movie Review in Telugu: సర్జమీన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Sarzameen Movie Review in Telugu: సర్జమీన్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Thalaivan Thalaivii Review in Telugu: తలైవన్ తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Thalaivan Thalaivii Review in Telugu: తలైవన్ తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

3 days ago

latest news

HariHara Veeramallu: ‘హరిహర వీరమల్లు’ కి అరుదైన గౌరవం.. ఏకంగా ఢిల్లీ ఏపీ భవన్ లో..!

HariHara Veeramallu: ‘హరిహర వీరమల్లు’ కి అరుదైన గౌరవం.. ఏకంగా ఢిల్లీ ఏపీ భవన్ లో..!

2 days ago
Athadu2: మురళీ మోహన్ ఆశపడుతున్నారు కానీ వర్కౌట్ అవుతుందా?

Athadu2: మురళీ మోహన్ ఆశపడుతున్నారు కానీ వర్కౌట్ అవుతుందా?

2 days ago
Spirit: ‘స్పిరిట్‌’ అప్‌డేట్‌ ఇచ్చిన సందీప్‌ రెడ్డి వంగా.. ఆ మాటల అర్థమేంటి?

Spirit: ‘స్పిరిట్‌’ అప్‌డేట్‌ ఇచ్చిన సందీప్‌ రెడ్డి వంగా.. ఆ మాటల అర్థమేంటి?

2 days ago
Chiranjeevi: 40 ఏళ్ళ క్రితం చిరు.. 15 క్రితం పవన్..లను ఇబ్బంది పెట్టిన టైటిల్..!

Chiranjeevi: 40 ఏళ్ళ క్రితం చిరు.. 15 క్రితం పవన్..లను ఇబ్బంది పెట్టిన టైటిల్..!

2 days ago
Vijay Deverakonda: 36 ఏళ్ల విజయ్‌ పెళ్లి గురించి ఇన్‌డైరెక్ట్‌ హింట్‌ ఇచ్చాడా? ఆ మాటకు అర్థమదేనా?

Vijay Deverakonda: 36 ఏళ్ల విజయ్‌ పెళ్లి గురించి ఇన్‌డైరెక్ట్‌ హింట్‌ ఇచ్చాడా? ఆ మాటకు అర్థమదేనా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version