Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » మాస్టర్ పీస్ మాయాబజార్ కు అరవై ఏళ్లు

మాస్టర్ పీస్ మాయాబజార్ కు అరవై ఏళ్లు

  • March 28, 2017 / 07:02 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మాస్టర్ పీస్ మాయాబజార్ కు అరవై ఏళ్లు

1957 మార్చి 27 .. తెలుగు చిత్ర పరిశ్రమ మరిచిపోలేని రోజు. కెవి రెడ్డి దర్శకత్వ ప్రతిభ, విజయ ప్రొడక్షన్స్ నిర్మాణపు విలువలు, మార్కస్ బార్ట్లే కెమెరా మాయ.. ఎస్వీఆర్, ఎన్టీఆర్, గుమ్మడి , సావిత్రి వంటి నటీనటుల అభినయం కలిసి తయారయిన మాస్టర్ పీస్ మాయాబజార్. ఈ ఎవర్ గ్రీన్ క్లాసికల్ ఫిల్మ్ నేటితో షష్టిపూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలోని మాయల గురించి ఫోకస్ ..

మణిహారంMaya Bazaar మహాభారతంలోని ప్రధాన పాత్రల మధ్య జరిగే భావోద్వేగ సంఘటనల మణిహారమే మాయాబజార్ కథ. ఈ సినిమా కథ స్క్రిప్ట్ గా చేయడానికి ఒక ఏడాది పట్టింది. నటీ నటులు, టెక్నీషియన్లు 400 మంది కలిసి ఈ చిత్రాన్నిరూపం ఇచ్చారు. మార్చి 27 , 1957 న విడుదల అయిన ఈ చిత్రం 24 సెంటర్లలో 100 రోజులు ఆడింది.

తొలి ద్వి భాష చిత్రం Maya Bazaar ఒకే సారి రెండు భాషలలో నిర్మించిన మొదటి చిత్రం మాయాబజార్. ఏకకాలంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించారు. రెండు భాషల్లోనూ సినిమా సూపర్‌ హిట్‌. తర్వాత కన్నడ, బెంగాలీ, హిందీ భాషల్లోకి అనువదించారు. అన్ని చోట్లా హిట్టే.

భారీ బడ్జెట్ Maya Bazaar ముప్పై వేల రూపాయలతో సినిమాలను కంప్లీట్ చేసే రోజుల్లో విజయ ప్రొడక్షన్స్ వారు రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ కళాఖండాన్నినిర్మించారు. దేశం లోనే తొలి సారిగా రెండు లక్షలతో నిర్మితమైన సినిమా చరిత్రలో నిలిచిపోయింది.

కెమెరాతో మాయMaya Bazaar పాతాళ భైరవితో పేరు తెచ్చుకున్న సినిమాటోగ్రాఫర్ మార్కస్ బార్ట్లే తన కెమెరా పనితనంతో వెండితెరపై అద్భుతాలను ఆవిష్కరించారు. ఎటువంటి గ్రాఫిక్స్ లేకుండా కొన్ని ట్రిక్స్ తో ప్రేక్షకులను ఆశ్చర్యంలో ముంచెత్తారు. వివాహ భోజనంబు.. లాహిరి లాహిరి పాటల చిత్రీకరణ మార్కస్ బార్ట్లే ట్యాలెంట్ కి నిదర్శనం.

కృష్ణుడు గా ఎన్టీఆర్ కనిపించిన తొలి మూవీ Maya Bazaar ‘ఇద్దరు పెళ్ళాలు’ (1954), ‘సొంతవూరు’ (1956) సినిమాల్లో కృష్ణుడు గా ఎన్టీఆర్ కాసేపు కనిపించారు. కానీ, పూర్తిస్థాయిలో పౌరాణిక కృష్ణుడిగా కొత్త గెటప్ లో అలరించడం మొదలుపెట్టింది మాత్రం ‘మాయాబజార్‌’తోనే. ఈ చిత్రం విడుదల తర్వాత 40,000 పైగా కృష్ణుడిగా ఉన్న ఎన్టీఆర్ క్యాలెండరు లు ప్రజలకు అందించారు. ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్ దాదాపు 19 పైగా చిత్రాల్లో కృష్ణుడిగా నటించారు.

ముందు పేరు ఘటోత్కచుడుMaya Bazaar మాయాబజార్ సినీమాకు మొదట అనుకున్న పేరు ఘటోత్కచుడు. ఎందుకంటే ఎస్వీఆర్ అప్పుడు పెద్ద స్టార్. అతను పోషించే పాత్రతో టైటిల్ పెడితే మార్కెట్ బాగుంటుందని భావించారు. కానీ ఎస్వీఆర్ మాయాబజార్ పెట్టమని సూచించారట. ఆలా పేరు మారింది.

అత్యద్భుత చలన చిత్రం Maya Bazaar 2013 లో CNN – IBN వారు నిర్వహించిన పోల్ లో భారత దేశం లోనే చూడదగ్గ అత్యద్భుత చలన చిత్రాల జాబితాలో మొదటిది గా మాయాబజార్ నిలిచింది.

పుస్తకంలో పాఠం Maya Bazaar మాయాబజార్ గురించి నేటి తరం వారికీ తెలియాలని 2014 నుంచి ఆంధ్ర ప్రదేశ్ 10వ తరగతి ఆంగ్ల పుస్తకం లో నాల్గవ పాఠం లా ఈ సినిమాని చేర్చారు.

వెయ్యికోట్ల చిత్రంMaya Bazaar 1957 లో ఉత్తమ తెలుగు చిత్రం గా ఫిలిం ఫేర్ అవార్డు అందుకున్న ఈ మూవీ ఈ సమయంలో రూపుదిద్దుకుని, రిలీజ్ అయితే వెయ్యికోట్లు తప్పకుండా వసూలు చేస్తుంది.

బ్లాక్‌ అండ్‌ వైట్‌ టు కలర్‌ Maya Bazaar ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో బ్లాక్‌ అండ్‌ వైట్‌ నుంచి కలర్‌లోకి మార్చిన తొలి భారతీయ సినిమా ప్రసిద్ధ ‘మొఘల్‌-ఏ-ఆజమ్‌’. ఆ ఘనత సాధించిన తొలి సౌతిండియన్ సినిమా ‘మాయాబజార్‌’., హైదరాబాద్‌కు చెందిన గోల్డ్‌స్టోన్ టెక్నాలజీస్‌ సంస్థ నెగిటివ్‌ను డిజిటైజ్‌ చేసి, ఆడియోను 5.1 ఛానల్స్‌లో రీ-మాస్టరింగ్‌ చేసి, సినిమాస్కోప్ లో, డి.టి.ఎస్‌. శబ్ద పరిజ్ఞానంలో ఈ కొత్త కలర్‌ వెర్షన్ ను సిద్ధం చేసింది. 2010 జనవరి 30 నాడు రిలీజై మరోసారి విజయం సాధించింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Iddaru Pellalu Movie
  • #Maya Bazaar
  • #Maya Bazaar Completed 60 Years
  • #Maya Bazaar Full Movie
  • #Maya Bazaar Movie

Also Read

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

Meghamsh Srihari: ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌ మంచి సక్సెస్ అందుకోవాలి అని కోరుకుంటున్నాను: శాంతి శ్రీహరి

Meghamsh Srihari: ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌ మంచి సక్సెస్ అందుకోవాలి అని కోరుకుంటున్నాను: శాంతి శ్రీహరి

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

Vishwanath And Sons Collections: మిక్స్డ్ టాక్ తో కూడా సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: మిక్స్డ్ టాక్ తో కూడా సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

related news

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

trending news

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

3 hours ago
Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

4 hours ago
Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

4 hours ago
Meghamsh Srihari: ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌ మంచి సక్సెస్ అందుకోవాలి అని కోరుకుంటున్నాను: శాంతి శ్రీహరి

Meghamsh Srihari: ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌ మంచి సక్సెస్ అందుకోవాలి అని కోరుకుంటున్నాను: శాంతి శ్రీహరి

4 hours ago
Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

23 hours ago

latest news

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

24 hours ago
DC Collections: మొదటి వారానికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

DC Collections: మొదటి వారానికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

1 day ago
Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?

Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?

1 day ago
Makutam: ‘మకుటం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Makutam: ‘మకుటం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 day ago
Vishwanath And Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version